జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1ఆధిక్యంలో దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్‌తో షో తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 182 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లో ఆతిథ్య జట్టును 159 పరుగులకే కట్టడి చేసింది.
ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. ఆల్‌రౌండ్‌షో కనబరిచిన భారత జట్టుపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్బుతంగా రాణించాము. ఈ వికెట్‌లో డబుల్ పేస్, బాల్ గ్రిప్పింగ్ ఎక్కువ ఉంది. ఇటువంటి పిచ్‌పై లెంగ్త్ బాల్స్‌ను హిట్ చేయడం అంత ఈజీకాదు.
కానీ మా బ్యాటర్లు ఇక్కడ పరిస్థితులను బాగా ఆర్ధం చేసుకున్నారు. అందుకు తగ్గట్టే బ్యాటింగ్ చేశారు. ఇక బౌలర్లతో కూడా అదే విషయం చర్చించాము. ఇక్కడ బంతి ఎక్కువగా గ్రిప్ప్ అవుతుండడంతో ఏది చేయాలన్న కొత్త బంతితో చేయాలని మా బౌలర్లకు చెప్పాను.
బంతి పాతదయ్యే కొద్దీ స్కోర్ చేయడం సులభం అని మాకు తెలుసు. అందుకు తగ్గట్టుగానే మా బౌలర్లు కొత్త బంతితో అద్బుతాలు సృష్టించారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి ఆదిలోనే ప్రత్యర్థిని కష్టాల్లో నెట్టారు.
జట్టు విజయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నిజంగా ఇది భారత క్రికెట్‌కు శుభసూచికమని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment