టీమిండియాతో రెండో వన్డేలో జింబాబ్వే మరోసారి తక్కువ స్కోరుకే ఆలౌటైంది. కనీసం రెండు వందల పరుగుల మార్క్‌ను కూడా అందుకోవడంలో విఫలమైన జింబాబ్వే పూర్తి ఓవర్లు ఆడకుండానే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. సీన్ విలియమ్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. రియాన్ బర్ల్ 39 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. మిగతావారిలో ఎవరు పెద్దగా రాణించలేదు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలా ఒక వికెట్ తీశారు.
ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టీమిండియాపై ఒక చెత్త రికార్డును మూట గట్టుకుంది. వరుసగా ఐదు వన్డేల్లో 200 కంటే తక్కువస్కోర్లు నమోదు చేసింది. ఇందులో రెండుసార్లు(34.3 ఓవర్లలో 126 పరుగులు, 42.2 ఓవర్లలో 123 పరుగులు)150 పరుగుల మాక్క్‌ను దాటని జింబాబ్వే.. మరో మూడు సార్లు 200 కంటే తక్కువ స్కోర్లు(49.5 ఓవర్లలో 168 ఆలౌట్, 40.3 ఓవర్లలో 189 పరుగులు).. తాజాగా 161 పరుగులు చేసింది.
చదవండి: Stuart Broad: అద్భుత విన్యాసం.. వికెట్లే కాదు క్యాచ్‌లు కూడా బాగా పట్టగలడు
Comments
Please login to add a commentAdd a comment