
టీ20 వరల్డ్‌కప్-2024లో గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియా.. వారం రోజుల తిరగక ముందే మరో పోరుకు సిద్దమైంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు టీ20 వరల్డ్‌కప్‌లో భాగమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది.
15 మంది సభ్యులతో కూడిన యువ భారత జట్టను జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ పంపించింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. జూలై 6న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
జింబాబ్వేకు చేరుకున్న భారత జట్టు..
ఇక ఈ సిరీస్ కోసం భారత జట్టు బుధవారం జింబాబ్వేలో అడుగుపెట్టింది. రాబర్ట్ గాబ్రియేల్ ముగాబే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఆటగాళ్లకు జింబాబ్వే క్రికెట్ ఘన స్వాగతం పలికింది.
ఇందుకు సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు జూలై 4న తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనుంది. ఇక కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన సహచర ఆటగాళ్ల కంటే ముందే న్యూయార్క్ నుంచి నేరుగా జింబాబ్వేకు చేరుకున్నాడు.
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.
𝐖𝐞 𝐰𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐓𝟐𝟎 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐈𝐧𝐝𝐢𝐚 🇮🇳 ! 🤗#ZIMvIND pic.twitter.com/Oiv5ZxgzaS
— Zimbabwe Cricket (@ZimCricketv) July 2, 2024