సూర్యకుమార్ యాదవ్- బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్
Asia Cup 2022 India Vs Hong Kong- Suryakumar Yadav- KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. రాహుల్ ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్నాడని.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. అప్పటి వరకు కాస్త ఓపికగా వేచిచూడాలంటూ హితవు పలికాడు. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు ముందుకు గాయపడ్డ కేఎల్ రాహుల్.. సుదీర్ఘ విరామం తర్వాత జింబాబ్వేతో టూర్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.
బ్యాటర్‌గా విఫలం..
ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సారథిగా జట్టును ముందుకు నడిపి క్లీన్‌స్వీప్ చేసినా బ్యాటర్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో మొదటి వన్డేలో రాహుల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక రెండు, మూడో మ్యాచ్‌లలో అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా 1(5 బంతులు), 30(46 బంతుల్లో).
ఇక జింబాబ్వే పర్యటన తర్వాత ఆసియా కప్-2022 టీ20 ఆడేందుకు నేరుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చేరుకున్న ఈ టీమిండియా వైస్ కెప్టెన్.. పాకిస్తాన్‌తో ఆరంభం మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. పాక్ అరంగేట్ర బౌలర్ 19 ఏళ్ల నసీమ్ షా బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
జట్టుకు భారం అంటూ..!
అదే విధంగా హాంగ్ కాంగ్‌తో రెండో మ్యాచ్‌లో రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగి 36 పరుగులు చేశాడు. కానీ.. అందుకోసం 39 బంతులు తీసుకున్నాడు. దీంతో రాహుల్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 మ్యాచ్‌లో టెస్టు ఇన్నింగ్స్ ఆడే రాహుల్ జట్టుకు భారం అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
రాహుల్‌ను తప్పించాలంటున్నారా?
ఈ నేపథ్యంలో హాంగ్ కాంగ్‌తో విజయం నేపథ్యంలో.. మీడియాతో ముచ్చటించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు ఓపెనర్‌గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు..‘‘అంటే మీరు కేఎల్ భాయ్‌ను జట్టు నుంచి తప్పించాలని చెబుతున్నారా’’ అంటూ తనదైన శైలిలో సూర్య కౌంటర్ ఇచ్చాడు.
కాస్త సమయం పడుతుంది!
అదే విధంగా.. గాయం నుంచి కోలుకున్న రాహుల్‌కు కాస్త సమయం ఇస్తే.. తనదైన ఆట తీరుతో చెలరేగగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే, జట్టు ప్రయోజనాల దృష్ట్యా తాను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావడానికి సిద్ధంగానే ఉన్నానని సూర్య మరోసారి స్పష్టం చేశాడు.
ఈ విషయం గురించి ఇప్పటికే కోచ్, కెప్టెన్‌కు చెప్పానని.. బ్యాటింగ్ ఆర్డర్‌లో తన స్థానం ఏదైనా తనకు సౌకర్యంగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు.
#SuryakumarYadav on #KLRahul #INDvsHK
— DD Sports (@Mahesh13657481) September 1, 2022
pic.twitter.com/QHdziB8oHg
చదవండి: Ind Vs HK: 'నీ బౌలింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్'
Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్
Comments
Please login to add a commentAdd a comment