
హారారే వేదికగా జింబాబ్వే- టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకోంది. జింబాబ్వే ఇన్నింగ్స్ 28 ఓవర్ వేసిన దీపక్ హుడా బౌలింగ్‌లో.. బర్ల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇషన్ కిషన్ వెగంగా పరిగెత్తుకుంటూ బంతిని అందుకున్నాడు.
అయితే బంతిని అందుకున్న కిషన్ మిడ్‌వికెట్ దిశగా త్రో చేశాడు. ఈ క్రమంలో మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ బంతి తనకు ఎక్కడ తగులుతుందన్న భయంతో తలపై చేతులు పెట్టుకుని కింద కూర్చోని పోయాడు. అయినప్పటికీ కిషన్ విసిరిన బంతి అక్షర్‌కు తగిలింది.
అక్షర్ వెంటనే కిషన్‌వైపు తిరిగి సీరీయస్‌గా చూశాడు. అయితే కిషన్ కూడా అక్షర్‌కు క్షమాపణ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు చేలరేగడంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది.
జింబావ్వే ఇన్నింగ్స్‌లో షాన్ విలియమ్స్ 42 పరగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో శార్థూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్ధీప్ యాదవ్, హుడా,ప్రసిద్ధ్ కృష్ణ తలా వికెట్ సాధించారు.
— Richard (@Richard10719932) August 20, 2022
చదవండి: IND vs ZIM: టీమిండియాపై జింబాబ్వే అత్యంత చెత్త రికార్డు..