దులీప్ ట్రోఫీ-2024ను భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో ఇండియా-సికి ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్.. అనంతపూర్ వేదకగా ఇండియా-బితో మ్యాచ్‌లో అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
కిషన్ 40 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రజిత్ పాటిదార్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కిషన్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కిషన్ ప్రస్తుతం 52 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
కాగా బీసీసీఐ ఆదేశాలను దిక్కరించి వేటుకు గురైన కిషన్ మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ ఏడాది జరగనున్న దేశీవాళీ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఇప్పటికే తమిళనాడు వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నీలో సత్తాచాటిన కిషన్.. ఇప్పుడు మరో దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 41 ఓవర్లకు ఇండియా-సి జట్టు 2 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
చదవండి: Vinesh Phogat: వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment