మొన్న పంత్‌.. ఇప్పుడు ఇషాన్‌ కిషన్‌! బౌలింగ్‌ వీడియో వైరల్‌ | Ishan Kishan Follows Rishabh Pants Lead, Bowled Off Spin Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

మొన్న పంత్‌.. ఇప్పుడు ఇషాన్‌ కిషన్‌! బౌలింగ్‌ వీడియో వైరల్‌

Published Fri, Aug 23 2024 7:14 PM | Last Updated on Fri, Aug 23 2024 8:07 PM

Ishan Kishan Follows Rishabh Pants Lead

భార‌త‌ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ స‌రికొత్త అవతార‌మెత్తాడు. బుచ్చిబాబు టోర్న‌మెంట్‌లో భాగంగా హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కిష‌న్ స్పిన్ బౌలింగ్ చేసి అంద‌ర‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

చెన్నై వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో విఫ‌ల‌మైన కిష‌న్‌.. బంతితో మాత్రం ఆక‌ట్టుకున్నాడు. హైద‌రాబాద్ బ్యాట‌ర్ టి ర‌వితేజ‌కు కిష‌న్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లు వేసిన కిష‌న్ కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వ‌తున్నాయి. కాగా ఇటీవల తన సహచర వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కూడా స్పిన్‌ బౌలింగ్‌ చేసి అందరిని షాక్‌ గురిచేశాడు. ఢిల్లీ ప్రీమియర్‌​ లీగ్‌లో పంత్‌ స్పిన్నర్‌గా మారాడు. ఇప్పుడు కిషన్‌ కూడా తన బౌలింగ్‌ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.

ఇక మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 114, 41 (నాటౌట్‌) పరుగులతో ఇషాన్‌ అలరించాడు. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం కిష‌న్ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. కాగా దేశ‌వాళీ క్రికెట్‌లో ఆడాల‌న్న త‌మ‌ ఆదేశాల‌ను దిక్క‌రించ‌డంతో కిష‌న్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. కిష‌న్ చివ‌ర‌గా భార‌త్ త‌ర‌పున‌ గ‌తేడాది వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement