ప్రసిద్ కృష్ణ (PC: Rajasthan Royals)
IPL 2023- Prasidh Krishna: టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ ఐపీఎల్-2023 సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజస్తాన్ రాయల్స్ ధ్రువీకరించింది. గాయం కారణంగా ప్రసిద్ ఈసారి ఐపీఎల్ ఆడబోవడం లేదని తెలిపింది.
త్వరగా కోలుకోవాలి
‘‘ప్రసిద్ గాయం నుంచి కోలుకోవడానికి కావాల్సిన ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ.. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని వైద్య బృందం తెలిపింది. దురదృష్టవశాత్తూ ప్రసిద్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు’’ అని రాజస్తాన్ యాజమాన్యం శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. ప్రసిద్ కృష్ణ స్థానాన్ని భర్తీ చేయగల పేసర్ కోసం తాము అన్వేషిస్తున్నామన్న మేనేజ్‌మెంట్.. త్వరలోనే ఈ యువ బౌలర్ కోలుకోవాలని ఆకాంక్షించింది.
కాగా గత సీజన్‌లో ప్రసిద్ కృష్ణ రాజస్తాన్ రాయల్స్ తరఫున మొత్తంగా 19 వికెట్లు( 8.28 ఎకానమీ) పడగొట్టి సత్తా చాటాడు. జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, గాయం కారణంగా ప్రస్తుత సీజన్‌కు అతడు దూరం కావడంతో రాజస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
అదే ఆఖరు
జింబాబ్వేతో 2022లో హరారేలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఖరిసారిగా ప్రసిద్ టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఇంకా కోలుకోలేదు.
ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడిన ఈ కర్ణాటక బౌలర్.. 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్‌లో 51 మ్యాచ్‌లలో మొత్తంగా 49 వికెట్లు కూల్చాడు.
చదవండి: Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
BGT 2023: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో రాహుల్ అద్భుత క్యాచ్.. బిత్తరపోయిన ఖవాజా.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment