జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు! సంజూ, దూబే ఔట్‌ | Sanju Samson, Shivam Dube And Jaiswal Released From ZIM Squad For First 2 T20Is, See Details | Sakshi
Sakshi News home page

IND vs ZIM: జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు! సంజూ, దూబే ఔట్‌

Published Tue, Jul 2 2024 3:15 PM | Last Updated on Tue, Jul 2 2024 3:41 PM

Samson, Dube and Jaiswal Released From ZIM Squad

జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగమైన  ఆటగాళ్లందరికి దాదాపుగా జింబాబ్వే పర్యటనకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. 

దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, రియాన్ ప‌రాగ్ వంటి యువ ఆట‌గాళ్ల‌కు తొలిసారి భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు జింబాబ్వేకు ప‌య‌న‌మైంది.

భార‌త జట్టులో కీల‌క మార్పులు..
ఇక ఈ సిరీస్‌కు ముందు భార‌త జ‌ట్టులో ప‌లు కీల‌క మార్పులు బీసీసీఐ చేసింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 భార‌త జ‌ట్టులో భాగ‌మైన సంజూ శాంస‌న్‌, య‌శ‌స్వీ జైశ్వాల్‌, శివ‌మ్ దూబేల‌ను జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేసిన జ‌ట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. 

వారి స్ధానంలో తొలి రెండు టీ20లకు హ‌ర్షిత్ రానా, సాయి సుద‌ర్శ‌న్‌, జితేష్ శ‌ర్మ‌ల‌ను బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక చేసింది. కాగా హ‌ర్షిత్ రానా, సాయిసుద‌ర్శ‌న్ తొలిసారి భార‌త జ‌ట్టుకు ఎంపికయ్యారు. కాగా  ఈ సిరీస్‌ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.

జింబాబ్వేతో తొలి రెండు టీ20ల‌కు భారత జ‌ట్టు
శుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌) , హర్షిత్ రాణా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement