జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్ 110 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో సంజూ కొట్టిన సిక్సర్ స్టేడియం బయట పడింది. ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Sanju Samson Smashed 110M SIX 🤯 #ZIMvIND #CricketTwitter pic.twitter.com/fQLHkjZvaX
— Mano (@manoj_tweezz) July 14, 2024
ఈ మ్యాచ్‌లో సంజూ ఈ సిక్సర్‌తో పాటు మరో మూడు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న సంజూ.. నాలుగు సిక్సర్లు, బౌండరీ సాయంతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో సంజూ మినహా భారత బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు.
భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.
తుది జట్లు..
జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ
టీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment