టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 6500 పరుగుల మైలు రాయిని అందుకున్న పదో భారత బ్యాటర్‌గా ధావన్ రికార్డులకెక్కాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ధావన్ ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ 81 పరుగులతో అఖరి వరకు ఆజేయంగా నిలిచి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల ధాటికి 189 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. అనంతరం 190 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్(82), ధావన్(81) పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు విజయాన్ని అందించారు.
వన్డేల్లో 6500 పరుగులు సాధించిన భారత ఆటగాళ్లు
సచిన్ టెండూల్కర్-18426 పరుగులు
విరాట్ కోహ్లి-12344 పరుగులు
సౌరవ్ గంగూలీ- 11363 పరుగులు
రాహల్ ద్రవిడ్-10889 పరుగులు
ఎంఎస్ ధోని-10773 పరగులు
ఎం అజారుద్దీన్- 9378 పరుగులు
రోహిత్ శర్మ-9378 పరుగులు
యువరాజ్ సింగ్-8701 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్-8273 పరుగులు
శిఖర్ ధావన్-6508 పరుగులు
🚨 Milestone Alert 🚨
— Sportskeeda (@Sportskeeda) August 18, 2022
Shikhar Dhawan has reached 6️⃣5️⃣0️⃣0️⃣ ODI runs for India 👏🇮🇳
What a player 💪🏻#ShikharDhawan #India #ZIMvIND #CricketTwitter pic.twitter.com/IZ5YPM7cp5
చదవండి: IND vs ZIM 1st ODI: ధావన్, గిల్ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment