టీ20 ప్రపంచకప్-2022లో అదరగొడుతున్న జింబాబ్వే పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జింబాబ్వే అద్భుతమైన ఫామ్‌లో ఉందని, ఆ జట్టులో మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ఉన్నారు అని గవాస్కర్ కొనియాడు. అదే విధంగా భారత్ కూడా జింబాబ్వేతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కాగా ఆక్టోబర్ 27న పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం తెలిసిందే.
ఈ క్రమంలో గవాస్కర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. "ఈ మెగా టోర్నీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్లే. వారు తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాలి. ముఖ్యంగా పాక్ జట్టు దక్షిణాఫ్రికాపై గెలవడం అంత సులభం కాదు. దక్షిణాఫ్రికా భీకర ఫామ్‌లో ఉంది.
అదే విధంగా భారత్ కూడా దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్టుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పాకిస్తాన్‌ను కంగుతినిపించిన జింబాబ్వేను కూడా భారత్ తేలికగా తీసుకోకూడదు. జింబాబ్వే జట్టులో మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్థాన్‌పై గెలిచి జింబాబ్వే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది" అని పేర్కొన్నాడు,
టీ20ల్లో ఏమైనా జరగొచ్చు
"పాకిస్తాన్ అద్భుతమైన జట్టు ఆనడంలోఎటువంటి సందేహం లేదు. కానీ టీ20ల్లో ఏమైనా జరగొచ్చు. పాక్ జట్టులో నాణ్యమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. కానీ ఈ మెగా ఈవెంట్‌లో వారు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేక పోతున్నారు" అని గవాస్కర్ తెలిపాడు. కాగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్30న దక్షిణాఫ్రికాతో తలపడుతోంది.
చదవండి: T20 WC 2022: శ్రీలంకతో మ్యాచ్.. కివీస్‌కు గుడ్ న్యూస్! అతడు వచ్చేస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment