హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
జింబాబ్వే బౌలర్లకు అభిషేక్ చుక్కలు చూపించాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి.
అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ 47 బంతుల్లో 11 ఫోర్లు,1 సిక్స్‌తో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రింకూ సింగ్( తన బ్యాట్‌కు పనిచెప్పాడు. రింకూ కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 పరగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజుబ్‌రానీ,మసకజ్డా తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment