హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే చేధించింది.
భారత బ్యాటర్లలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్ ధావన్(33),గిల్(33) పరుగులతో రాణించారు. కాగా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో జాంగ్వే రెండు వికెట్లు పడగొట్టగా.. చివంగా, రజా, న్యాచీ తలా వికెట్ తీశారు.
161 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే
ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో షాన్ విలియమ్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో శార్థూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్ధీప్ యాదవ్, హుడా,ప్రసిద్ధ్ కృష్ణ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే ఆగస్టు 22న హరారే వేదికగా జరగనుంది.
చదవండి: IND vs ZIM: టీమిండియాపై జింబాబ్వే అత్యంత చెత్త రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment