India tour of Zimbabwe, 2022- ODI Series: ‘‘మహ్మద్ సిరాజ్ మంచి బౌలర్. అతడి బౌలింగ్‌లో ఆడటం ఎంతో బాగుంటుంది. ఎక్కువ పరుగులు పిండుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే తను గొప్ప బౌలర్ కదా’’ అంటూ జింబాబ్వే బ్యాటర్ ఇన్నోసెంట్ కియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా సొంతగడ్డపై టీమిండియాతో వన్డే సిరీస్‌కు జింబాబ్వే సిద్ధమైన సంగతి తెలిసిందే.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా ఇరు జట్లు గురువారం(ఆగష్టు 18) మొదటి వన్డేలో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇన్నోసెంట్ కియా.. తాము కచ్చితంగా భారత జట్టుకు గట్టి సవాల్ విసురుతామని పునరుద్ఘాటించాడు.
అతడు పట్టిందల్లా బంగారమే..!
ఈ మేరకు ఇన్నోసెంట్ కియా మాట్లాడుతూ.. ‘‘సికిందర్ రజా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు. ప్రతిసారి, ప్రతి విషయంలోనూ తను విజయవంతమవుతున్నాడు.
ఈ సిరీస్‌లో కూడా అతడు అదే తరహాలో ముందుకు సాగాలని భావిస్తున్నాం. టీమిండియాతో మ్యాచ్‌లలో అతడు ఎంత మేరకు రాణించగలడో అంతమేర శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడనే నమ్మకం ఉంది. నిజం చెప్పాలంటే మేము ఇటీవలి కాలంలో అత్యద్భుతంగా ఆడుతున్నాం’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక భారత బౌలర్లలో సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కియా వెల్లడించాడు. అదే విధంగా కోచ్ డేవిడ్ హౌన్ తమను సానుకూల దృక్పథంతో ముందుకు నడుపుతూ ఆత్మవిశ్వాసం నింపుతున్నాడని కియా వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్ ఎలాగైనా గెలవాలన్నదే తమ ప్లాన్ అని చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియాను 2-1తో ఓడించి సిరీస్ గెలుస్తామంటూ కియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు.
అదరగొడుతున్నాడు!
హరారేలో జన్మించిన ఇన్నోసెంట్ కియా.. ఈ ఏడాది జూన్‌లో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌తో జింబాబ్వే తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 6 వన్డేలు ఆడి 245 పరుగులు సాధించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో కియా 110 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతడు పొట్టి ఫార్మాట్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 54.
చదవండి: Ind Vs Zim: కోహ్లి, రోహిత్ లేరు.. టీమిండియాను 2-1తో ఓడిస్తాం: జింబాబ్వే బ్యాటర్! ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు భయ్యా!
Mike Tyson: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..?
IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త
Comments
Please login to add a commentAdd a comment