జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. హరారే వేదికగా భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో ఆడుతోంది. పేసర్ ఖాలీల్ అహ్మద్ స్ధానంలో యువ బ్యాటర్ సాయిసుదర్శన్ తుది జట్టులోకి వచ్చాడు. సాయిసుదర్శన్‌కు భారత్ తరపున ఇదే తొలి టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.
సాయిసుదర్శన్ ఐపీఎల్‌లో అద్బుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. కాగా సుదర్శన్ ఇప్పటికే భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
తుది జట్లు
జింబాబ్వే: వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా
భారత్
భారత్
శుబ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment