
భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లకు సర్వం సిద్దమైంది. జూలై 5న హరారే వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య జింబాబ్వే పూర్తిస్ధాయి జట్టుతో బరిలోకి దిగుతుండగా.. భారత్ మాత్రం పూర్తిగా యువ జట్టుతో ఆడనుంది.
ఈ పర్యటనకు టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. దీంతో ఓపెనర్ శుబ్‌మన్‌గిల్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.
అభిషేక్ అరంగేట్రం..
ఇక తొలిసారి భారత జట్టు ఎంపికైన అభిషేక్ శర్మ.. శనివారం జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ధ్రువీకరించాడు. ఈ మ్యాచ్‌కు మీడియాతో మాట్లాడిన గిల్.. తనతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడని చెప్పుకొచ్చాడు.
అదే విధంగా ఫస్ట్ డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌కు రానున్నాడని గిల్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతనిథ్యం వహించిన అభిషేక్ శర్మ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్‌తో కలిసి భీబత్సం సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్‌లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్‌లో సైతం అదరగొడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment