టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.
జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌కు టీమిండియా సీనియర్లంతా దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గైర్హాజరీ కారణంగా.. తొలిసారిగా ఈ పంజాబీ బ్యాటర్‌కు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే సువర్ణావకాశం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ తర్వాత అతడే
రోహిత్ శర్మ వారసుడిగా శుబ్‌మన్ గిల్ సరైన ఎంపిక అంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్ గిల్‌కు ఎంతో భవిష్యత్తు ఉంది.
మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడగల సత్తా అతడికి ఉంది. గతేడాది తనకు గొప్పగా గడిచింది. అయితే, దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
సరైన నిర్ణయం
నా అభిప్రాయం ప్రకారం.. గిల్‌ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. రోహిత్ శర్మ వెళ్లిన తర్వాత శుబ్‌మన్ గిల్ మాత్రమే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలుగుతాడు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ గిల్ నైపుణ్యాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు.
అదే విధంగా.. జింబాబ్వేతో సిరీస్‌కు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ వంటి ఐపీఎల్ హీరోలను ఎంపిక చేయడం పట్ల సెహ్వాగ్ స్పందించాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయడంలో తనకు తప్పేమీ కనిపించడం లేదన్నాడు.
జింబాబ్వే టూర్‌కు టీమిండియా
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే.
Comments
Please login to add a commentAdd a comment