T20 WC 2022 Ind Vs Zim: Fans Troll Rishabh Pant Failure In Zimbabwe Match - Sakshi
Sakshi News home page

Rishabh Pant: రాక రాక వచ్చిన అవకాశం.. జింబాబ్వే చేతిలో కూడానా? ఇంకా నయం..

Published Sun, Nov 6 2022 3:40 PM | Last Updated on Sun, Nov 6 2022 4:08 PM

WC 2022 Ind Vs Zim: Fans Troll Rishabh Pant Failure In Zimbabwe Match - Sakshi

విఫలమైన పంత్‌ (PC: ICC Instagram)

ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ పునరాగమనం తర్వాత.. యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు జట్టులో స్థానం కోసం అతడితో పోటీ నెలకొంది. టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి వీరిద్దరు ఎంపికైనప్పటికీ యాజమాన్యం సీనియారిటీకే ఓటు వేసింది. సూపర్‌-12లో భాగంగా వరుసగా నాలుగు మ్యాచ్‌లలో డీకేను ఆడించగా.. పంత్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో.. టీమిండియా సెమీస్‌ బెర్తు ఖరారైన విషయం తెలిసిందే. దీంతో ఆఖరిదైన జింబాబ్వేతో మ్యాచ్‌ భారత్‌కు నామమాత్రంగా మారిపోయింది. ఇక మ్యాచ్‌ ద్వారా వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో తొలిసారిగా తుది జట్టులోకి వచ్చాడు పంత్‌.

పంత్‌ ఏంటిది?
అయితే, డీకే స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఎంట్రీ ఇచ్చిన రిషభ్‌ పంత్‌ పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 5 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం మూడు పరుగులకే అవుటయ్యాడు. సీన్‌ విలియమ్స్‌ బౌలింగ్‌లో పంత్‌ షాట్‌కు యత్నించగా.. ర్యాన్‌ బర్ల్‌కు అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో తొందరగానే పెవిలియన్‌ చేరిన పంత్‌పై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఆస్ట్రేలియా పిచ్‌లపై బాగా ఆడతాడు. కాబట్టి డీకేను కాదని పంత్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ రికీ పాంటింగ్‌ లాంటి దిగ్గజాలు చెబుతారు. కానీ నువ్వేమో రాక రాక వచ్చిన అవకాశాన్ని ఇలా చేజేతులా నాశనం చేసుకున్నావు. 

జింబాబ్వే బౌలర్లను కూడా ఎదుర్కోలేకపోతున్నావు. ఇంకా నయం నెదర్లాండ్స్‌ గనుక సౌతాఫ్రికాను ఓడించకపోతే నిన్ను నమ్మేవాళ్లు కాదేమో! నామమాత్రపు మ్యాచ్‌ కాబట్టి ఛాన్స్‌ ఇచ్చి ఉంటారు’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా గ్రూప్‌-2 నుంచి టీమిండియాతో పాటు పాకిస్తాన్‌ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. 

చదవండి: Shakib Al Hasan: ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌
WC 2022: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం ఆ రెండే! ముఖ్యంగా యూఏఈ!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement