టీ20 వరల్డ్‌కప్-2022లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు బౌండరీ లైన్ బయట నిల్చున్న రిషబ్ పంత్‌తో పరాచకాలాడారు. ఊర్వశి.. ఊర్వశి అంటూ కేరింతలు పెడుతూ అతన్ని ఆటపట్టించారు. ఆకతాయిల అల్లరిని పంత్ వినీ విననట్లు వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
తమ అభిమాన క్రికెటర్‌ను టీజ్ చేయడంపై పంత్ అభిమానులు మండిపడుతున్నారు. అసలే జట్టులో స్థానం దక్కక బాధలో ఉన్న పంత్‌ను ఇలా ఏడ్పించడం సబబు కాదని అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన వ్యక్తితో ఇలా ప్రవర్తించడం దేశాన్ని అవమానించడం లాంటిదని స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) October 24, 2022
కాగా, రిషబ్ పంత్, బాలీవుడ్ అప్‌కమింగ్ నటి ఊర్వశి రౌతేలాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో పంత్ ఈ వ్యవహారాన్ని లైట్‌గా తీసుకుని ఆటపై దృష్టి పెడుతున్నా.. ఊర్వశి మాత్రం అతన్ని ఏదో ఒకలా గెలుకుతూనే ఉంది. వరల్డ్‌కప్ ఆడేందుకు పంత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంటే.. లవ్‌ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసి పంత్‌ను గెలికే ప్రయత్నం చేసింది.
ఊర్వశి చేసిన ఈ పోస్ట్‌కు పంత్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటరిచ్చారు. స్టాకర్ (వ్యక్తి ఇష్టం లేకుండా వెంట పడటం) అంటూ ఆటాడుకున్నారు. కొందరైతే మా వాడిని ప్రశాంతంగా వదిలేయమ్మా అంటూ బ్రతిమలాడుకున్నారు.
ఇవన్నీ పక్కకు పెడితే, అక్టోబర్ 23న పాక్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ విశ్వరూపం ప్రదర్శించి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. టీమిండియా యాజమాన్యం వికెట్‌కీపర్ కోటాలో దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో డీకే విఫలమయ్యాడు. దీంతో నెదర్లాండ్స్‌తో రేపు (అక్టోబర్ 27) జరుగబోయే మ్యాచ్‌లో పంత్‌కు అవకాశమిస్తారని అంతా భావిస్తున్నారు.
చదవండి: పంత్‌ను మరోసారి గెలికిన రౌతేలా.. లవ్‌ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ..!
Comments
Please login to add a commentAdd a comment