జింబాబ్వేతో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన రాహుల్ సేన(PC: BCCI)
ODI Men's Team Rankings: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు 111 రేటింగ్ పాయింట్లు సాధించింది. ఇక నెదర్లాండ్స్‌తో సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా దాయాది పాకిస్తాన్ నాలుగో ర్యాంకును పదిలం చేసుకుంది.
కివీస్ మొదటి స్థానమే అయినా!
ఇక వెస్టిండీస్‌ను 2-1తో ఓడించిన న్యూజిలాండ్ జట్టు 124 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. అయితే, విండీస్‌కు ఒక మ్యాచ్ కోల్పోయిన నేపథ్యంలో ఐదు పాయింట్లు కివీస్ చేజారాయి. మరోవైపు.. ఇంగ్లండ్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఆసియా కప్ టోర్నీకి సన్నద్ధం!
కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో కేఎల్ రాహుల్ జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు సారథ్యం వహించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వరుసగా 10 వికెట్లు, 5 వికెట్లు, 13 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ మూడు మ్యాచ్‌లలో అద్బుతంగా రాణించిన బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
మరోవైపు.. పాకిస్తాన్ నెదర్లాండ్స్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినా.. ఆతిథ్య డచ్ జట్టు నుంచి మొదటి, ఆఖరి వన్డేల్లో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వే, నెదర్లాండ్స్ పర్యటన ముగించుకున్న టీమిండియా, పాకిస్తాన్ ఆసియా కప్-2022 టోర్నీకి సన్నద్ధమవుతున్నాయి. ఆగష్టు 28న దుబాయ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో యూఏఈకి పయనమయ్యాయి.
ఐసీసీ మెన్స్ వన్డే జట్టు తాజా ర్యాంకింగ్స్ టాప్-5
1. న్యూజిలాండ్- రేటింగ్- 124
2. ఇంగ్లండ్- రేటింగ్- 119
3. ఇండియా- రేటింగ్- 111
4. పాకిస్తాన్- రేటింగ్- 107
5. ఆస్ట్రేలియా- రేటింగ్- 101
చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ! ద్రవిడ్ దూరం?!
Asia Cup 2022: యూఏఈ చేరుకున్న టీమిండియా.. కోహ్లి ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్
Comments
Please login to add a commentAdd a comment