దీపక్‌ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! | Deepak Hooda creates new world record after Indias win in 2nd ODI | Sakshi
Sakshi News home page

IND vs ZIM: దీపక్‌ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

Published Sun, Aug 21 2022 7:32 AM | Last Updated on Sun, Aug 21 2022 8:01 AM

Deepak Hooda creates new world record after Indias win in 2nd ODI - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ దీపక్ హుడా ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో సత్తాచాటి జట్టులో స్థానాన్ని సుస్ధిరం చేసుకున్న హుడా.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా జింబాబ్వేతో రెండో  వన్డేలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో హుడా 25 పరుగులతో పాటు ఒక వికెట్‌ పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌తో  దీపక్ హుడా ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన తర్వాత హుడా ఆడిన 16 మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించింది. తద్వారా అం‍తర్జాతీయ క్రికెట్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా హుడా నిలిచాడు. హుడా ఇప్పటి వరకు 9 టీ20లు, 7వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిద్యం వహించాడు.

సాట్విక్ నడిగోటియా రికార్డు బద్దలు కొట్టిన హుడా
కాగా గతంలో ఈ రికార్డు రొమేనియా ఆటగాడు సాట్విక్ నడిగోటియా పేరిట ఉండేది. నడిగోటియా అరంగేట్రం చేసిన అనంతరం రొమేనియా 15 మ్యాచ్‌ల్లో విజయం నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో నడిగోటియా ప్రపంచ రికార్డును హుడా బద్దలు కొట్టాడు. ఇక​ ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
చదవండి: IND vs ZIM: వన్డేల్లో గిల్ అరుదైన ఫీట్‌.. మూడో భారత ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement