జింబాబ్వేతో టీ20 సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. శనివారం హరారే వేదికగా జరగనున్న నాలుగో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
తొలి టీ20లో అనూహ్య ఓటమి చవిచూసిన గిల్ బ్రిగేడ్.. తర్వాత రెండు టీ20ల్లో మాత్రం ప్రత్యర్ధిని చిత్తు చేసింది. అదే జోరును నాలుగో టీ20లో కొనసాగించాలని యంగ్ టీమిండియా భావిస్తోంది.
ధోని శిష్యుడి ఎంట్రీ?
అయితే ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు పేసర్లు ఖాలీల్ అహ్మద్, అవేష్ ఖాన్‌లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఖాలీల్ స్ధానంలో ముంబై స్టార్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే అంతర్జాతీయ అరగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ధోని శిష్యుడిగా పేరొందిన దేశ్‌పాండేకు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు, ఐపీఎల్‌లో సీఎస్‌కేకు గత రెండు సీజన్లలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్-2024లో 17 వికెట్లు పడగొట్టిన తుషార్.. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో 16 వికెట్లు సాధించాడు.
ఈ క్రమంలోనే అతడికి చోటు ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. అదేవిధంగా అవేష్ ఖాన్ స్ధానంలో పేసర్ ముఖేష్ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.
జింబాబ్వేతో నాలుగో టీ20కు భారత తుది జట్టు(అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment