
ఈ ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024 అనంతరం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై అదే నెల 14న ముగియనుంది.
ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఒకరిద్దరూ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికి ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
అంతేకాకుండా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీలో అదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు ఈ సిరీస్‌లో భారత జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట.
కాగా పంత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పునరాగమనంలో కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా సత్తాచాటుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పంత్ 210 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, సాయిసుదర్శన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లను సైతం జింబాబ్వే టూర్‌కు పంపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment