హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టీ20కు సిద్దమవుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే మూడో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టు ఎంపిక చేయడం శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు వరల్డ్‌కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ కారణంగా యశస్వీ జైశ్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే దూరమైన సంగతి తెలిసిందే.
వారి స్ధానంలో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను తాత్కాలికంగా బీసీసీఐ జింబాబ్వేకు పంపింది. అయితే ఇప్పుడు జైశ్వాల్, సంజూ, దూబే మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం జట్టుతో చేరారు. వీరి రావడంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలు జట్టును వీడనున్నారు.
ఈ క్రమంలో జట్టు కూర్పు కొంచెం కష్టంగా మారింది. అభిషేక్ శర్మ ఓపెనర్‌గా దుమ్ములేపుతుండడంతో జైశ్వాల్ మూడో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
తొలి మ్యాచ్‌లో జురెల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికి తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక రెండో టీ20కు జట్టులోకి వచ్చిన సాయిసుదర్శన్ స్ధానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జింబాబ్వేతో మూడో టీ20.. భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment