తుస్సుమన్న పాక్‌ బ్యాటర్లు.. ఇంగ్లండ్‌ ఘన విజయం | England vs Pakistan By 23 Runs In 2nd T20I | Sakshi
Sakshi News home page

తుస్సుమన్న పాక్‌ బ్యాటర్లు.. ఇంగ్లండ్‌ ఘన విజయం

Published Sun, May 26 2024 10:00 AM | Last Updated on Sun, May 26 2024 11:13 AM

England vs Pakistan By 23 Runs In 2nd T20I

నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా స్వదేశంలో పాక్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. బర్మింగ్హమ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను చిత్తు చేసింది. 

టాస్‌ ఓడి పాక్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్‌ 19.2 ఓవర్లలో 160 పరుగులకే చాపచుట్టేసి 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా 1-0 ఆధిక్యంతో సిరీస్‌లో ముందడుగు వేసింది. 

సిరీస్‌లో భాగంగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. మూడో టీ20 కార్డిఫ్‌ వేదికగా ఈ నెల 28న జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.  

మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న బట్లర్‌
ఈ మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో (51 బంతుల్లో 84; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లండ్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేయగలిగింది. విల్‌ జాక్స్‌ (23 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (18 బంతుల్లో 21; ఫోర్‌, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా నిరాశపరిచారు. 

ఓ దశలో (14.5 ఓవర్లలో 144/2) ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ సాధించేలా కనిపించింది. అయితే పాక్‌ బౌలర్లలో ఒక్కసారిగా లయను అందుకోవడంతో ఇంగ్లండ్‌ ఓ మోస్తరు స్కోర్‌తో సరిపెట్టుకోక తప్పలేదు. షాహీన్‌ అఫ్రిది 3, ఇమాద్‌ వసీం​, హరీస్‌ రౌఫ్‌ తలో 2 వికెట్లతో రాణించారు.

తేలిపోయిన పాక్‌ బ్యాటర్లు..
ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి పాక్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫకర్‌ జమాన్‌ (45), బాబర్‌ ఆజమ్‌ (32), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (23), ఇమాద్‌ వసీం (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతావారంతా దారుణంగా విఫలమయ్యారు. 

రీస్‌ టాప్లే భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ 3 వికెట్లు పడగొట్టగా.. మొయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌ తలో 2 వికెట్లు పడగొట్టి పాక్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. క్రిస్‌ జోర్డన్‌, ఆదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ పడగొట్టి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement