ముంబై: విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) హెడ్జింగ్ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సడలించింది. ఇప్పటికి వరకూ ఈసీబీలకు సంబంధించి పూర్తి 100 శాతం హెడ్జింగ్ అవసరంకాగా ఈ ప్రొవిజన్‌ను 70 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. వ్యాపారంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోవడానికి వినియోగించే పెట్టుబడి సాధనాల్ని హెడ్జింగ్‌గా పేర్కొంటారు. మూడు నుంచి ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌కు (టైర్ 1 ఈసీబీ ఫ్రేమ్‌వర్క్) ఈ సడలింపు వర్తిస్తుందని తాజా నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నోటిఫికేషన్‌కు ముందు హెడ్జింగ్‌ల విషయంలోనూ తాజా సవరణ వర్తిస్తుందని, రోలోవర్స్‌లో హెడ్జింగ్‌ను తగ్గించుకోవచ్చని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment