ECB Chief issues apology To Pakistan: భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్ల మానసిక, శారీరక క్షేమం ముఖ్యమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పాక్ పర్యటను రద్దు చేసుకుంది. ఈ అయితే పాక్ పర్యటనను ఇంగ్లండ్ రద్దు చేసుకోవడంపై ఆ జట్టు క్రికెట్ బోర్డుపై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ద్వజం ఎత్తారు. ఈ క్రమంలో స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛీప్ ఇయాన్ వాట్మోర్ క్షమాపణలు తెలిపారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్‌లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు.
"ముఖ్యంగా మా నిర్ణయంతో పాకిస్తాన్ బాధపడినందకు నేను చింతిస్తున్నాను. బోర్డు తీసుకున్న నిర్ణయం చాలా క్లిష్టమైనది. మా ఆటగాళ్లు, సిబ్బంది సంక్షేమం, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటన కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎదురుచూస్తోంది ”అని వాట్మోర్ డైలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు.
అయితే ఈసీబీ ఛీప్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌదరి ముక్తకంఠంతో స్వాగతించారు. "వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్ రాబోతుందని ప్రకటించడం చాలా సంతోషకరం. పాకిస్థాన్ క్రికెట్‌కు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని మాజీ క్రికెటర్లకు, మీడియా, క్రికెట్ అభిమానులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా''. అని ఆయన ట్వీట్ చేశారు
Comments
Please login to add a commentAdd a comment