పీటర్సన్ వేటుపై ఈసీబీ
లండన్: డాషింగ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్‌ను జట్టు నుంచి తప్పించడంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పందించింది. కెప్టెన్ అలిస్టర్ కుక్‌తో సరైన సంబంధాలు లేని కారణంగానే అతడిని పక్కన పెట్టాల్సి వచ్చిందని తేల్చి చెప్పింది. జట్టు ఆటగాళ్లంతా ఇప్పుడు కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, కెప్టెన్ కు సంపూర్ణ మద్దతు అవసరమని ఈసీబీ అభిప్రాయపడింది. ఆసీస్ పర్యటనలో ఇంగ్లండ్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ దారుణ పరాజయాలు ఎదుర్కొన్న సంగతి విదితమే. ఈ దశలో జట్టు వాతావరణాన్ని మార్చేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. ‘ఇంగ్లండ్ జట్టుకు పీటర్సన్ అందించిన సేవలు మరిచిపోలేం. ఆసీస్‌లో వైట్‌వాష్ అనంతరం జట్టును పునర్‌నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. దీంట్లో భాగంగా ఇప్పుడు కెప్టెన్ కుక్‌కు మద్దతుగా నిలిచే ఆటగాళ్లు కావాలి. ఈ కారణాలతోనే పీటర్సన్ లేకుండానే ముందుకెళ్లాలని భావించాం’ అని ఈసీబీ స్పష్టం చేసింది.
కుక్ కోసమే తీసేశాం
Published Tue, Feb 11 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
Advertisement
Advertisement