లండన్: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలవుతున్న తరుణంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న క్రీడా ఈవెంట్లపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆడటానికి అనుమతులు వచ్చినా అది ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే దిశగా ఆయా క్రీడా సమాఖ్యలు ఆలోచన చేస్తున్నాయి. దీనిని కొందరు వ్యతిరేకిస్తుండగా, మరి కొందరు సమర్ధిస్తున్నారు. అసలు ప్రేక్షకులు లేకుండా మజానే ఉండదనే అభిప్రాయాన్ని మెజార్టీ సభ్యులు వ్యక్తం చేస్తుండగా, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం అదిరిపోయే సలహా ఇచ్చాడు. ఇప్పటివరకూ ఎవరికీ తట్టని ఒక ఆలోచనతో ఆర్చర్ ముందుకొచ్చాడు. (‘నన్ను ఎందుకు తీశావని ధోనిని అడగలేదు’)
ఈ సంక్షోభంలో ప్రేక్షకులు అవసరం లేదంటూనే వారి చేసే గోల మాత్రం ఉండాలంటున్నాడు. అదేంటి స్టేడియాల్లో జనాలు లేకుండా సందడి ఎలా వస్తుందని అనుకుంటున్నారా.. అందుకు చక్కటి ఉపాయం చెప్పేశాడు. క్రీడలు పునరుద్ధించబడ్డ తర్వాత స్టేడియాల్లో ప్రేక్షకులు చేసే గోలను ఆడియో రూపంలో ఏర్పాటు చేస్తే మనం వారు ఉన్నట్లే ఫీలవుతామని అంటున్నాడు. ‘మనం స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా ఎందుకు ఆడలేం. ఆడొచ్చు. ఎలా అంటే మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఆడియో ప్లే చేద్దాం. చప్పట్లు, ఈలలతో స్టేడియాలను ఊదరగొట్టేలా చేద్దాం. దాంతో మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకు తప్పకుండా ఊపు వస్తుంది. అది కూడా ఎలా ఉండాలంటే వాస్తవిక మ్యాచ్‌లను తలపించేలా ఉండాలి’ అని ఆర్చర్ పేర్కొన్నాడు. క్రికెట్ టోర్నీలు నిర్వహించినా ఎంత సురక్షితం నిర్వహిస్తే అంత మంచిదన్నాడు. (ఐసీసీ ట్రోల్స్‌పై అక్తర్ సీరియస్ రియాక్షన్)
Comments
Please login to add a commentAdd a comment