Photo Credit: ECB Twitter
అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శుక్రవారం 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. కాగా జట్టును ప్రకటించి 24 గంటలు గడవకముందే ఇంగ్లండ్‌కు బిగ్‌షాక్ తగిలింది. విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో అనూహ్య రీతిలో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.
''బెయిర్ స్టో దూరమవడం మా దురదృష్టం. శుక్రవారం లీడ్స్‌లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో కాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది.దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బెయిర్ స్టోను పరిశీలించిన వైద్యులు సర్జరీ అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు'' అని ఈసీబీ పేర్కొంది. కాగా ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు బెయిర్ స్టో స్థానంలో బెన్ డకెట్‌ను ఎంపిక చేశారు. అయితే టి20 ప్రపంచకప్‌కు మాత్రం బెయిర్ స్టో స్థానంలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు.
కాగా బెయిర్ స్టో తన గాయంపై స్పందించాడు. ''ఇవాళ ఉదయం గోల్ఫ్ కోర్సులో గేమ్ ఆడుతుండగా జారి పడ్డాను. దీంతో కాలి కింది భాగంలో గాయం కావడంతో వైద్యులు సర్జరీ అవసరమన్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు దూరం కావడం బాధిస్తోంది. నేను ఆడకపోయినప్పటికి మా కుర్రాళ్లకు ఆల్ ది బెస్ట్'' అని చెప్పుకొచ్చాడు.
ఇక టి20 ప్రపంచకప్‌కు ఈసీబీ ప్రకటించిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు రాగా.. జేసన్ రాయ్‌కు మొండిచేయి ఎదురైంది. తాజాగా గాయంతో బెయిర్ స్టో కూడా దూరమయ్యాడు. కాగా రాయ్ ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున ఆడిన 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తంగా 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ జరుగనుంది.
టీ20 ప్రపంచకప్-2022కు ఈసీబీ ప్రకటించిన ఇంగ్లండ్ జట్టు : జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!'
Comments
Please login to add a commentAdd a comment