
అందమె ఆనందం
మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖమంతా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మెంతికూరను మెత్తని పేస్టులా రుబ్బి, దాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే నొప్పి తగ్గడమే కాదు, మొటిమలూ అణిగిపోతాయి!
మోచేతులు, మోకాళ్లు బిరుసుగా అయ్యి, నల్లబడిపోతాయి. వాటిని మామూలుగా చేయాలంటే... జామపండును మెత్తగా రుబ్బి, అందులో కాసింత నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బిరుసుగా ఉన్న చోట బాగా రుద్దాలి. రోజుకోసారయినా ఇలా చేస్తే, మంచి ఫలితముంటుంది.