knees
-
వాకింగ్ వల్ల మోకాళ్లు దెబ్బతింటాయా.? అలా కాకూడదంటే..?
కొందరూ వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ల సమస్య వస్తుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అందుకని వాకింగ్ మానేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే సమస్య ఉన్నా కూడా మార్నింగ్ సమయంలో వాకింగ్‌కి వెళ్లడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. సమస్య తీవ్రతరం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. శారీరక, మానసిక ధృఢత్వం కోసం పూర్తి కార్డియో వ్యాయామాలు, నడక ఎల్లప్పుడూ మంచివి. ఉదయం నడకతో రోజుని ప్రారంభిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వాకింగ్ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా బరువు నిర్వహణలో కూడా ఉపయోగపడుతుంది. అయితే నడిచే విధానంలో తప్పుడు విధానం లేదా భంగిమలో నడవడం కారణంగా దిగువ శరీరంగపై ఒత్తిడి ఎక్కువై మోకాళ నొప్పికి దారితీస్తోంది. అదికాస్తా దీర్ఘకాలిక ఆస్టియో ఆర్థరైటిస్ కారణమవుతుంది. ఇలాంటి సమస్యలు రాకూడదంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని వాకింగ్ వెళ్లితే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.మార్నింగ్ వాకింగ్ ప్రారంభించే ముందే కొన్ని వార్మింగ్ అప్ వ్యాయామాలు చేయండి. ఇది మిమ్మల్ని శక్తిమంతంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. నెమ్మదిగా శరీరాన్ని సాగదీయడం, కొద్దిపాటి ఎక్సర్‌సైజ్‌లతో శరీరంలో ఉష్ణోగ్రత వస్తుంది. అందువల్ల సులభంగా నడవడగలుగుతాం.అలాగే గోరు వెచ్చని నీటితో ఫ్రెష అయ్యాక వాకింగ్ వెళ్లండి. దీనివల్ల సులభంగా కదిలేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకింగచి కీళ్ల ద్రవం కదిలేందుకు సహాయపడుతుంది. ఎల్లప్పుడూ నడకని నెమ్మదిగా ప్రారంభించండి. ఈ నడక షెడ్యూల్‌ను దాదాపు పది నిమిషాల్లో చేసేలా సెట్ చేయండి. అలా రోజుకి 30 నిమిసాలు చేసేలా వేగం పెంచుకోండి. కాలక్రమేణ వేగంగా నడవగులుగుతారు, సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. రోజుకి కనీసం ఆరువేల అడుగులు వేయండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు రోజుకు కనీసం ఆరువేల అడుగులు నడిస్తే చాలప్రయోజనం ఉంటుంది. నడకను ట్రాప్ చేసేల ఫోన్ యాప్‌ని ఉపయోగించండి. ముఖ్యంగా సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. మడమపై ఒత్తిడి పడకుండా నడవగలిగేలా ఫ్లాట్, ఫ్లెక్సిబుల్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ 0.75 లేదా అంతకంటే తక్కువ ఎత్తులో ఉండే బూట్లను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నొప్పి లేకుంటే కంటిన్యూగా నడవండి. అలా కాకుండా నొప్పి మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతుంటే ఒకటి లేదా రెండు నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ ప్రయత్నించండి. అలాగే చదునుగా ఉండే మైదానం లేదా ఉపరితలంపైనే నడవండి. మోకాళ్లకు నడక ఎందుకు మంచిదంటే..?మోకాళ్లలోని మృదులాస్థి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషణను అందిస్తుంది. కీళ్లను కదిలించడం వల్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇది ఎక్కువసేపు పనిచేసేందుకు ఉపకరిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం కండారాలను మెరుగ్గా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ వాకింగ్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.(చదవండి: ఎరుపు ఆర్గాంజా చీరలో జాన్వీ స్టన్నింగ్ లుక్..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
Jahnvi Kapoor: ఓరీతో కలిసి తిరుమలను దర్శించిన హీరోయిన్ (ఫోటోలు)
-
సినిమాని తలపించే సీన్..ప్రియురాలి కోసం ఏకంగా 21 గంటలు..
సినిమాల్లో ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాల్లో హీరో మోకాళ్లపై కూర్చోవడం చూసే ఉంటాం. రియల్ లైఫ్‌లో అలా కుదరదు. అంతగా అవసరమైతే నాలుగైదు సార్లు బతిమాలడం లేదా పెద్దవాళ్లను ఎవరినైనా పిలిపించి మాట్లాడించటం వంటివి చేస్తారు చాలామంది. కానీ ఇక్కడొక వ్యక్తి తన మాజీ ప్రియురాలికి బ్రేక్అప్ చెప్పి వెళ్లొద్దు అంటూ ఎంతగా వేడుకున్నాడంటే సినిమాలోని సీన్లను మించిపోయేలా చేశాడు. ఏకంగా ఆమె కోసం వర్షంలో 21 గంటల పాటు మెకాళ్ల పైనే ఉండిపోయాడు. ఎవరూ ఎంతగా చెప్పినా వినకుండా అలానే ఆమె కోసం వర్షంలో తడుస్తూ ఉండిపోయాడు. అసలేం జరిగిందంటే.. చైనాలోని ఓ వ్యక్తికి ప్రియురాలు బ్రేక్ అప్ చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి నిన్ను వదులుకోలేనంటూ ఆమెను ఎంతగానో బతిమాలుకున్నాడు. ఆమె ప్రేమను ఎలాగైనా తిరిగి పొందాలనుకుని ఆమె పనిచేసే కార్యాలయానికి వెళ్లి.. చేతిలో పూల బొకేతో లవ్ ప్రపోజ్ చేసే భంగిమలో (మోకాళ్లపై) నుంచొని ఆమె కోసం ఆత్రంగా ఎదురు చూశాడు. ఇలా అతను మార్చి 28 మధ్యాహ్నం 1 గంటకు అనగా నిలబడ్డ వ్యక్తి ఆ మరుసటి రోజు ఉదయ 10 గంటల వరకు జోరు వానలో అలానే మోకాళ్లపై ఉండిపోయాడు. ఎవరూ ఎంత చెప్పినా ససేమిరా అన్నాడు. ఆఖరికి పోలీసులు రంగంలోకి దిగినా.. విరమించి లేవడానికి అస్సలు ఒప్పుకోకపోగా, ఇది చట్ట విరుద్ధం కాకపోతే నన్ను వదిలేయండి అని పోలీసులను అభ్యర్థించాడు. తన మాజీ ప్రియురాలు తనతో విడిపోయిందని, క్షమాపణలు కోరుతూ ఇలా ఉన్నాని వారికి చెప్పాడు. అతడు ఇంత హంగామా చేసినా.. అక్కడ ఎక్కడా ఆమె జాడ కనిపించకపోవడం విచిత్రం. పాపం ఆ వ్యక్తి ప్రేమ ఫలించిందా? లేదా అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉండిపోయింది. అందుకు సంబంధించిన విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మీరు ఆమె కోసం మోకరిల్లి ఉండాల్సిన అవసరం లేదని కొందరూ అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు, మరికొందరు ఆమెకు నీ ప్రేమను పొందే అర్హత లేదు అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: తీరు మార్చుకోని చైనా! అది మా సార్వభౌమాధికారం అంటూ మంకుపట్టు) -
ఉదయంపూట కీళ్లు పట్టేస్తున్నాయి
నా వయసు 39 ఏళ్లు. నేను పదేళ్లగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నాను. పొద్దున లేవగానే కీళ్లన్నీ పట్టేసి జ్వరం వచ్చినట్లుగా ఉండి, మధ్యాహ్నానికి ఉపశమనం ఉంటోంది. ఈఎస్ఆర్ పెరిగి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ కీళ్లనొప్పులకు హోమియోలో చికిత్స ఉందా? మీకు వచ్చిన వ్యాధిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో ఒకరక. మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, వాటితో పోరాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ పొరబడి తన సొంత శరీరంపైనే దాడి చేస్తే వచ్చే సమస్యల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి శరీరంలోని ఇరుపక్కలా సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావడంతో వాటి కదలికలు పూర్తిగా స్తంభిస్తాయి. దాంతో కీళ్లు వైకల్యానికి గురికావడం జరుగుతుంది. కీళ్లనొప్పులు, వాపు, కీళ్లు పట్టివేయడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కీళ్లు మాత్రమే కాకుండా కళ్లు, నోరు, ఊపిరితిత్తులకు వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. అయితే మొదట చేతివేళ్లు, కాలివేళ్ల వంటి చిన్న చిన్న కీళ్లలో మొదలై ఆ తర్వాత మోచేయి, మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లలోకి పాకుతుంది. కారణాలు: ►శరీరంలోని జీవక్రియల్లో అసమతౌల్యత, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది ►శారీరక, మానసిక ఒత్తిడి ►పొగతాగడం, మద్యం అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ►ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అస్సలు పాటించని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు: ►నిరాశ, అలసట, ఆకలితగ్గడం, బరువు తగ్గడం ►మడమ చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావడం ►ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగపట్టినట్లుగా ఉండి, నొప్పి ఉండటం ►ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, ఊపిరితిత్తులు గట్టిపడటం ►రక్తహీనత, జ్వరం వంటివి. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే, ఎమ్మారై, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఏఎన్ఏ, ఎల్ఎఫ్టీ. చికిత్స: రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్, కాల్చికమ్, ఆర్సినికమ్, లైకోపోడియమ్, నేట్రమ్మూర్ మొదలైన మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సమూలంగా నయమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...
మనం నడుస్తూంటే.. కీళ్లు కూడా కదులుతూంటాయి. మరి ఈ కదలికలను కాస్తా విద్యుదుత్పత్తికి వాడుకునేలా చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్ శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఒక్కో పరికరం ఉత్పత్తి చేసే 1.6 మైక్రోవాట్ల విద్యుత్తుతో జీపీఎస్ పరికరాలు, ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఉపయోగించే పరికరాలను నడిపేందుకు ఉపయోగించుకోవచ్చునని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. ప్రత్యేకమైన మైక్రోఫైబర్ పదార్థంతో తయారైన ఈ పరికరాన్ని మోకాళ్ల వద్ద బిగించుకోవాల్సి ఉంటుందని... శరీరంలోని ఇతర కీళ్ల కంటే మోకాలి కీలు ద్వారా ఎక్కువ కదలికలు ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లియావ్ తెలిపారు. మనిషి కదలికల ద్వారా పుట్టే కంపనాలు చాలా నెమ్మదిగా ఉంటాయని ఫలితంగా విద్యుదుత్పత్తి చేయడం కష్టమవుతుందని.. తాము మాత్రం ఈ సమస్యను అధిగమించేందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నామని లియావ్ వివరించారు. ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన యంత్రం దాదాపు 307 గ్రాముల బరువు ఉందని, గంటకు రెండు నుంచి 6.5 కిలోమీటర్ల వేగంతో నడిచే మనుషులపై తాము ఈ యంత్రాన్ని పరిక్షించి చూశామని వివరించారు. యంత్రం ధరించినప్పుడు, సాధారణ పరిస్థితుల్లో వీరి ఉచ్ఛ్వాస నిశ్వాసలను పరిశీలించిన తరువాత యంత్రాన్ని మోసేందుకు ఉపయోగిస్తున్న శక్తి కంటే విద్యుదుత్పత్తి ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని వివరించారు. -
పిక్క ప్యాంటు
ఈ ప్యాంటు లెంగ్త్‌కు ఒక లెక్కుంది. దీని పొడవు పిక్క వరకు ఉంటుంది. తొడుక్కోడానికి అనువుగా ఉంటుంది. చకచక నడకకు సౌకర్యంగా ఉంటుంది. చిటపట చినుకుల్లో చివర్లు తడవకుండా ఉంటుంది. ఈ పిక్క ప్యాంటు బెస్ట్. ‘కాప్రి’ ప్యాంటు పేరున్న ఇదే లేటెస్ట్. కాప్రి ఫ్యాషన్ మోకాళ్లకు కొద్దిగా కిందుగా లేదంటే ఇంకాస్త పిక్కల దాకా.. మరికాస్త పొడవు ఉండే కాప్రి ఎల్లలు దాటి ఎవర్గ్రీన్ జాబితాలో చేరింది. కాప్రి అనే పదం ఇటాలియన్ భాష నుంచి వచ్చిందని, 1950-60లలో అమెరికాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. మొదటిసారి అమెరికన్ నటి గ్రేస్‌కెల్లీ తన సినిమాలో ధరించి ఆకట్టుకున్నా ప్రపంచమంతా కాప్రి వైపు మళ్లేలా చేయడంలో మాత్రం నటి మార్లిన్ మన్రో, ఆడ్రీ హెప్బర్న్లకే సాధ్యమైంది. నాటి నుంచి ప్రతి అమ్మాయి వార్డ్‌రోబ్‌లో కాప్రి కామ్‌గా చేరిపోయింది. క్యూట్‌గా కనిపించేలా చేసే ఈ ప్యాంట్ మీదకు సింపుల్ టీ షర్ట్ ధరిస్తే చాలు అందంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తారు. పాదాలకు అంతే అందమైన హీల్స్, కిల్లర్ హీల్స్ వంటివి ధరిస్తే ఈవెనింగ్ పార్టీవేర్‌కి ఎంచక్కా అమరిపోతుంది. ఈ లెక్క కాప్రీని కలర్ఫుల్గా మార్చేసింది. కొత్త కొత్త డిజైన్లలో ఒదిగిపోయింది. కాప్రీ ప్యాంట్‌నే త్రీ క్వార్టర్ ప్యాంట్, క్రాప్ ప్యాంట్స్, పెడెల్ పుషర్స్, కామ్ డిగ్గర్స్, ఫ్లడ్ ప్యాంట్స్, జామ్స్, హై వాటర్ కల్టర్స్, టొరెడార్ ప్యాంట్స్... ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు. ఇన్ని పేర్లు ఉన్నా కాప్రి అనే పదమే నేడు ప్రపంచమంతా వాడుకలో ఉంది. మీరు కాప్రి ధరిస్తున్నారా?! అయితే డిజైనర్స్ ఇచ్చే సూచనలు తప్పనిసరి... చాలామంది అమ్మాయిలు, మహిళలు కాప్రి ప్యాంట్స్ విషయంలో సరైన అవగాహన ఉండదు. దీనికి కారణం వాస్తవానికి దూరంగా ఉండటం. పొట్టిగా ఉన్నవారు కాప్రి ప్యాంట్స్ ధరిస్తే మరింత పొట్టిగా కనపడతారు.పొడవుగా ఉంటే మరింత హైట్ అనిపిస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే... నడుము వెడల్పుగా ఉన్నవారు కాప్రి కాళ్ల భాగం పొడవుగా ఉండేది తీసుకోవాలి. దీనికి షార్ట్ టాప్ సరైన ఎంపిక. స్లిమ్‌గా కనిపించాలంటే లోయర్ లెగ్ పార్ట్ మరీ టైట్‌గా ఉండేది ఎంచుకోకపోవడమే మేలు. లావుగా ఉన్నవారు లెగ్స్‌కి అతుక్కుపోయేలాంటి కాప్రిని ఎంచుకోవద్దు. వీటి వల్ల మరింత లావుగా కనిపిస్తారు. అలాగే స్ట్రెయిట్ కట్ ఉన్నది ఎంచుకోవాలి. లెగ్గింగ్ కాప్రి ధరించాలనుకునేవారికి ఈ జాగ్రత్త తప్పనిసరి.కాప్రి ప్యాంట్ ధరించినప్పుడు పొట్టిగా కనిపిస్తున్నాం అనుకుంటే హీల్స్ ధరించేడమే సేఫ్.కాప్రి ప్యాంట్ మీదకు ట్యూనిక్, చిక్ ఔట్ ఫిట్.. వంటి మంచి రంగు ఉన్న టాప్ ధరిస్తే లుక్ బాగా కనిపిస్తుంది. స్మార్ట్‌గా కనిపించాలంటే నెక్లేస్ లేదంటే ఏదైనా పెద్దబ్యాగ్ చేత పట్టుకుంటే చాలు. ►కాప్రి ప్యాంటు, డిజైనర్ టాప్ ధరించి స్టైల్‌గా వెలిగిపోతున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యాబచ్చన్. క్యాజువల్, కంఫర్ట్ అనిపించే ఈ తరహా డ్రెస్సింగ్ అతివల ఆత్మవిశ్వాసానికి సిసలైన చిరునామా అనిపించుకుంటుంది. ►లేస్, లేదా స్ట్రాప్డ్ లెగ్గింగ్ కాప్రి స్టైల్స్ ప్యాంటు ట్రెండ్‌ని ఫాలో అవుతున్న వారి జాబితాలో చేరుస్తాయి. ► కాప్రి పాయింట్స్ ఇప్పుడు ఇంకాస్త పొడవుగా మారాయి. అదే రంగు లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ ధరిస్తే అఫిషియల్ లుక్‌తో అదరగొట్టేస్తారు. ►జీన్స్ కాప్రి ఎంపిక ఎప్పుడూ స్టైల్లో ముందుంచుతుంది. రఫ్, స్పీడ్, స్టైల్‌తో మీ రూపం ఇట్టే ఆకట్టుకుంటుంది. జీన్స్ కాప్రిలో నటి అక్ష. ► క్యాజువల్ వేర్లో కాప్రి విత్ టాప్ ఈవెనింగ్ వేర్‌గా సౌకర్యాన్నిచ్చే డ్రెస్. ►పార్టీ వేర్‌లోనూ కంఫర్ట్ వెతుక్కునేవారికి కాప్రి ట్రౌజర్ స్టైల్ సరికొత్త స్టైల్ స్టేట్మెంట్. -
మోకాళ్ళ నొప్పులకు త్రీడీ ప్రింటింగ్..!
మోకాళ్ళ నొప్పులతోపాటు, దెబ్బతిన్న చెవి, ముక్కు వంటి వాటికి త్రీడీ ప్రింటెడ్ ఇంప్లాంట్స్ తో సులభంగా చికిత్స చేయొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. క్రీడాకారులు, వృద్ధులు, గాయాలవల్ల ఇబ్బందిపడే అనేక మందితో పాటు ఆర్థరైటిస్ ఉన్నవారు కార్టిలేజ్ (మృదులాస్థి) కోల్పోయి తీవ్రమైన నొప్పులతో బాధపడుతుంటారు. ఇటువంటి వారికోసం ఓ సరికొత్త ప్రయోగాన్ని అందుబాటులోకి తెచ్చింది అమెరికా శాండియాగోలోని అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీసీ). 251వ జాతీయ సమావేశాల సందర్భంలో ఈ ప్రయోగాన్ని పరిశోధకులు పరిచయం చేశారు. త్రీ డైమెన్షనల్ బయో ప్రింటింగ్ అనేది సాంకేతిక కణజాల పునరుత్పత్తికి తోడ్పడుతుందని, ఇది వైద్య చరిత్రలో విప్లవాన్ని సృష్టిస్తుందని స్వీడన్ వాలెన్ బర్గ్ వుడ్ సైన్స్ సెంటర్ కు చెందిన పరిశోధక బృందంలోని పాల్ గాటెన్ హోమ్ చెప్తున్నారు. గాయాలు, కేన్సర్ వంటి వాటివల్ల నష్టపోయిన కార్టిలేజ్ (మృదులాష్టి) ను సృష్టించేందుకు తమ బృదం ప్లాస్టిక్ సర్జన్స్ తో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తోందన్నారు. ప్రస్తుతం సర్జెన్లు ముక్కు, చెవి వంటి శరీరంలోని ఇతర భాగాలను బాగు చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోందని, ఏదో ఓరోజు త్రీడీ ప్రింటింగ్ ద్వారా రోగి కణాల నుంచి తయారు చేసే బయో ఇంక్ తో అటువంటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని గాటెన్ హోమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా తయారు చేసే బయో ఇంక్ తో గాటెన్ హోమ్ బృదం ప్రయోగశాల ద్వారా మృదులాస్థిని ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు జరుపుతోంది. ప్రయోగశాల్లో తయారైన ప్రింటెడ్ టిష్యూ శాంపిల్స్ ను పరిశోధకులు ఎలుకలకు అమర్చి చూశారు. కణాలు పనిచేయడంతోపాటు మృదులాస్థి ఉత్పత్తి అయినట్లుగా కొనుగొన్నారు. అయితే కణజాల సంఖ్యను పెంచేందుకు ఇక్కడ మరో అడ్డంకి ఎదురైంది. దీంతో ఎముక మజ్జు నుంచి తీసిన మూల కణాలతో కాండ్రోసైట్స్ ను కలిపి 60 రోజులపాటు వివో టెస్టింగ్ లో ఉంచారు. ఈ ప్రాధమిక పరిశోధనలు కాండ్రోసైట్ ను మృదులాస్థిని పెంచేందుకు ప్రోత్సహించినట్లు కనుగొన్నారు. ఇక మానవులపై ప్రయోగించేందుకు ముందుగా కొన్ని ప్రీ క్లినికల్ పరీక్షలు చేయాల్సి ఉన్నట్లుగా గాటెన్ హోమ్ తెలిపారు. -
అందమె ఆనందం
మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖమంతా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మెంతికూరను మెత్తని పేస్టులా రుబ్బి, దాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే నొప్పి తగ్గడమే కాదు, మొటిమలూ అణిగిపోతాయి! మోచేతులు, మోకాళ్లు బిరుసుగా అయ్యి, నల్లబడిపోతాయి. వాటిని మామూలుగా చేయాలంటే... జామపండును మెత్తగా రుబ్బి, అందులో కాసింత నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బిరుసుగా ఉన్న చోట బాగా రుద్దాలి. రోజుకోసారయినా ఇలా చేస్తే, మంచి ఫలితముంటుంది. -
తిరుమలకు మోకాళ్లపై నడిచిన జగన్ అభిమాని