కొందరూ వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ల సమస్య వస్తుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అందుకని వాకింగ్ మానేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే సమస్య ఉన్నా కూడా మార్నింగ్ సమయంలో వాకింగ్‌కి వెళ్లడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. సమస్య తీవ్రతరం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు.
శారీరక, మానసిక ధృఢత్వం కోసం పూర్తి కార్డియో వ్యాయామాలు, నడక ఎల్లప్పుడూ మంచివి. ఉదయం నడకతో రోజుని ప్రారంభిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వాకింగ్ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా బరువు నిర్వహణలో కూడా ఉపయోగపడుతుంది. అయితే నడిచే విధానంలో తప్పుడు విధానం లేదా భంగిమలో నడవడం కారణంగా దిగువ శరీరంగపై ఒత్తిడి ఎక్కువై మోకాళ నొప్పికి దారితీస్తోంది. అదికాస్తా దీర్ఘకాలిక ఆస్టియో ఆర్థరైటిస్ కారణమవుతుంది. ఇలాంటి సమస్యలు రాకూడదంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని వాకింగ్ వెళ్లితే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
మార్నింగ్ వాకింగ్ ప్రారంభించే ముందే కొన్ని వార్మింగ్ అప్ వ్యాయామాలు చేయండి. ఇది మిమ్మల్ని శక్తిమంతంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. నెమ్మదిగా శరీరాన్ని సాగదీయడం, కొద్దిపాటి ఎక్సర్‌సైజ్‌లతో శరీరంలో ఉష్ణోగ్రత వస్తుంది. అందువల్ల సులభంగా నడవడగలుగుతాం.
అలాగే గోరు వెచ్చని నీటితో ఫ్రెష అయ్యాక వాకింగ్ వెళ్లండి. దీనివల్ల సులభంగా కదిలేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకింగచి కీళ్ల ద్రవం కదిలేందుకు సహాయపడుతుంది.
ఎల్లప్పుడూ నడకని నెమ్మదిగా ప్రారంభించండి. ఈ నడక షెడ్యూల్‌ను దాదాపు పది నిమిషాల్లో చేసేలా సెట్ చేయండి. అలా రోజుకి 30 నిమిసాలు చేసేలా వేగం పెంచుకోండి. కాలక్రమేణ వేగంగా నడవగులుగుతారు, సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.
రోజుకి కనీసం ఆరువేల అడుగులు వేయండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు రోజుకు కనీసం ఆరువేల అడుగులు నడిస్తే చాలప్రయోజనం ఉంటుంది. నడకను ట్రాప్ చేసేల ఫోన్ యాప్‌ని ఉపయోగించండి.
ముఖ్యంగా సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. మడమపై ఒత్తిడి పడకుండా నడవగలిగేలా ఫ్లాట్, ఫ్లెక్సిబుల్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ 0.75 లేదా అంతకంటే తక్కువ ఎత్తులో ఉండే బూట్లను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నొప్పి లేకుంటే కంటిన్యూగా నడవండి. అలా కాకుండా నొప్పి మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతుంటే ఒకటి లేదా రెండు నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ ప్రయత్నించండి.
అలాగే చదునుగా ఉండే మైదానం లేదా ఉపరితలంపైనే నడవండి.
మోకాళ్లకు నడక ఎందుకు మంచిదంటే..?
మోకాళ్లలోని మృదులాస్థి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషణను అందిస్తుంది. కీళ్లను కదిలించడం వల్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇది ఎక్కువసేపు పనిచేసేందుకు ఉపకరిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం కండారాలను మెరుగ్గా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ వాకింగ్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
(చదవండి: ఎరుపు ఆర్గాంజా చీరలో జాన్వీ స్టన్నింగ్ లుక్..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)
Comments
Please login to add a commentAdd a comment