దక్షిణాఫ్రికాపై 5 వికెట్ల తేడాతో విజయం..భోణి కొట్టిన ఆస్ట్రేలియా
టి20 ప్రపంచకప్ 2021లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం అందుకొని భోణి కొట్టింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు అవసరమైన దశలో మార్కస్ స్టోయినిస్(24 నాటౌట్), మాథ్యూ వేడ్(15 నాటౌట్) ఆసీస్‌ను గెలిపించారు. అంతకముందు స్టీవ్ స్మిత్ 35 పరుగులు పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2, షంసీ, కగిసో రబడ, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు.
మ్యాక్స్‌వెల్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఆసీస్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ షమ్సీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి. అంతకముందు ఎయిడెన్ మక్రమ్ సూపర్ క్యాచ్‌కు స్టీవ్ స్మిత్(35)వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 80 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్(11) ఔట్
119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 11 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో వాండర్ డుసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. స్మిత్ 30, మ్యాక్స్‌వెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు డేవిడ్ వార్నర్ రబడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ఆరోన్ ఫించ్ డకౌట్
119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా 118/9.. ఆసీస్ టార్గెట్ 119
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్ల దాటికి మక్రమ్(40) మినహా ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, కమిన్స్ చెరో వికెట్ తీశారు.
ఎనిమిదో వికెట్ డౌన్.. దక్షిణాఫ్రికా 98/8
మక్రమ్(40) భారీ షాట్‌కు యత్నించి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 98 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది.
దక్షిణాఫ్రికా దారుణ ఆటతీరు కనబరుస్తుంది. ఆసీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు చేయడంలో నానా కష్టాలు పడుతున్న దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా కేశవ్ మహరాజ్(0) కమిన్స్ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆసీస్ బౌలర్ల ప్రతాపం.. ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
ఆసీస్ బౌలర్లు తమ ప్రతాపం చూపిస్తుండడంతో దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా 1 పరుగు చేసిన ప్రిటోరియస్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అంతకముందు 16 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది.
13 ఓవర్లలో దక్షిణాఫ్రికా 78/4
13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. మక్రమ్ 28, డేవిడ్ మిల్లర్ 14 పరుగులతో ఆడుతున్నారు.
10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 59/4
10 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 5, ఎయిడెన్ మక్రమ్ 19 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 13 పరుగులు చేసిన క్లాసెన్ కమిన్స్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
డికాక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా డికాక్(7) దురదృష్టవశాత్తూ బౌల్డ్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వాండర్ డుసెన్(2) వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు పార్ట్‌టైమ్ బౌలర్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కెప్టెన్ బవుమా(12) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. డికాక్ 2, మక్రమ్ 1 పరుగుతో ఆడుతున్నారు.
అబుదాబి: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా నేటి నుంచి సూపర్ 12 దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. సుదీర్ఘ కాలంపాటు క్రికెట్‌ను శాసించినా టి20 ప్రపంచకప్ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షే అయింది. ఆరు టోర్నీలను చూస్తే 2010లో ఫైనల్ చేరడం మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ప్రస్తుత టీమ్‌లో ఓపెనర్లు వార్నర్, ఫించ్ పేలవ ఫామ్‌లో ఉండటం కలవరపెడుతుండగా... మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్, స్మిత్, స్టొయినిస్‌లను జట్టు నమ్ముకుంది.
మరోవైపు స్టార్లతో నిండి ఉన్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్‌లో ఫైనల్ చేరలేదు. ఇప్పుడు పెద్దగా అనుభవంలేని ఆటగాళ్లు ఎక్కువ మందితో కూడిన టీమ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడే అవకాశం ఉండటం సానుకూలాంశం. ఇక ముఖాముఖి పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య 21 టి20 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 13 ఆస్ట్రేలియా.. 8 దక్షిణాఫ్రికా గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా 29 మ్యాచ్‌ల్లో 16 విజయాలు.. 13 ఓటములు చవిచూసింది. ఇక దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్‌లలో 30 మ్యాచ్‌ల్లో 18 గెలిచి.. 12 ఓడింది.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, రాసీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కాగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, తబ్రేజ్ షమ్సీ
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
Comments
Please login to add a commentAdd a comment