AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్‌దే.. | T20 World Cup 2021: Awkward Dismissal Quinton De Kock Viral Aus Vs SA | Sakshi
Sakshi News home page

AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్‌దే..

Published Sat, Oct 23 2021 4:06 PM | Last Updated on Sat, Oct 23 2021 7:20 PM

T20 World Cup 2021: Awkward Dismissal Quinton De Kock Viral Aus Vs SA - Sakshi

Quinton De Kock Awkward Dismissal.. టి20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ను దురదృష్టం వెంటాడింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ తొలి బంతిని డికాక్‌ డిఫెన్స్‌ చేయబోయి మిస్‌ అయ్యాడు. అయితే బంతి అతని ప్యాడ్స్‌కు తాకి క్రీజు మీద పడింది. దీంతో డికాక్‌ పరుగుకు యత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా వెనక్కి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో డికాక్‌ అవుట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది.

ఇక్కడ దురదృష్టమేమిటంటే డికాక్‌ అక్కడే  ఉండి కూడా బంతిని అడ్డుకోలేకపోయాడు.  తాను ఔటయ్యాననే బాధతో నిరాశగా క్రీజులోనే కాసేపు నిల్చొని పెవిలియన్‌ చేరాడు. ఇక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తడబడుతుంది. 6 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement