bowled
-
AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్‌దే..
Quinton De Kock Awkward Dismissal.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను దురదృష్టం వెంటాడింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 4వ ఓవర్ తొలి బంతిని డికాక్ డిఫెన్స్ చేయబోయి మిస్ అయ్యాడు. అయితే బంతి అతని ప్యాడ్స్‌కు తాకి క్రీజు మీద పడింది. దీంతో డికాక్ పరుగుకు యత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా వెనక్కి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో డికాక్ అవుట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక్కడ దురదృష్టమేమిటంటే డికాక్ అక్కడే ఉండి కూడా బంతిని అడ్డుకోలేకపోయాడు. తాను ఔటయ్యాననే బాధతో నిరాశగా క్రీజులోనే కాసేపు నిల్చొని పెవిలియన్ చేరాడు. ఇక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తడబడుతుంది. 6 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది. Calamity for South Africa as de Kock plays it onto his stumps via @t20worldcup https://t.co/v75y5QkujC — varun seggari (@SeggariVarun) October 23, 2021 -
బౌల్డ్ పై డీఆర్ఎస్ కు వెళ్లాడు..
-
బౌల్డ్ పై డీఆర్ఎస్ కు వెళ్లాడు..
గాలె: సాధారణంగా ఎల్బీలు, క్యాచ్‌లు వంటి అనుమానాస్పద నిర్ణయాల్లో మాత్రమే అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని క్రికెటర్లు కోరుతుంటారు. అయితే శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ ను సవాల్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతమైన నవ్వులు తెప్పించింది. శనివారం చివరి రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ ఆటగాడు సౌమ్య సర్కార్ బౌల్డ్ అయ్యాడు. శ్రీలంక మీడియం ఫాస్ట్ బౌలర్ గుణరత్నే బౌలింగ్ లో్ సౌమ్య సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే బౌల్డ్ అయిన విషయాన్ని పూర్తిగా చూడని సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ కు వెళ్లాడు. సౌమ్య సర్కార్ బౌల్డ్ అయ్యే క్రమంలో ఫీల్డ్ అంపైర్ కాస్త ఆలస్యంగా నిర్ణయం ప్రకటించడంతో అసలు వికెట్ల వద్ద ఏమి జరిగిందో అనే విషయాన్ని అతను పట్టించుకోలేదు. తన అవుట్ ను సవాల్ చేసే ముందు తాను ఎందుకు డీఆర్ఎస్ కు వెళ్లాల్సివచ్చిందో కనీసం తెలియకపోవడం అభిమానుల్లో నవ్వులు పూయించింది. ఆ మ్యాచ్ లో శ్రీలంక 259 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.