సిడ్నీ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయాన్ని ఒక్కో ఆటగాడు ఒక్కో విధంగా పంచుకుంటున్నారు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను ఏ పని చేసినా వెంటనే ఆ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటున్నాడు. వార్నర్, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్వతహాగానే మంచి మిత్రులు. వార్నర్ చేసిన ప్రతీ వీడియోనూ ఎంజాయ్ చేస్తూ వచ్చిన ఫించ్ తానెందుకు టిక్‌టాక్ వీడియో చేయొద్దని అనుకున్నాడు. వెంటనే టిక్‌టాక్ యాప్ ఓపెన్ చేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. కానీ డ్యాన్స్ అంటే కేవలం చేతులను ఆడిస్తే సరిపోదనుకొని బాడీ మూమెంట్స్ కూడా ప్రయత్నించాడు, అయితే మూమెంట్స్ అనుకున్నంత మంచిగా రాకపోవడంతో డ్యాన్స్‌ను ఆపేశాడు. ఆ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఆరోన్ ఫించ్ ఇలా రాసుకొచ్చాడు.('వారిని ప్రపంచకప్‌లో మాత్రం ఓడించలేకపోయాం')
'నా వయసు 30 దాటిపోవడంతో డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అందులోనూ డ్యాన్స్ చేస్తూ టిక్‌టాక్ యాప్‌లో వీడియో తీయడం ఇంకా ఇబ్బందిగా ఉంది. నా మిత్రుడు వార్నర్ లాక్‌డౌన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వార్నర్ వయసులో పెద్దవాడైనా డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తున్నాడు. నేను కూడా అతని లాగా చేద్దామనుకున్నా.. కానీ కుదరలేదు. నా వరకు డ్యాన్స్ కంటే క్రికెట్ ఆటే బాగుంది' అంటూ క్యాప్షన్ జతచేశాడు. అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ కరోనా వైరస్ నేపథ్యంలో ఆలస్యమయ్యే అవకాశముందని ఫించ్ పేర్కొన్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్దమవ్వడానికి ముందు ఒక సిరీస్ ఆడితే బాగుంటుదనే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ ద్వారా పేర్కొన్నట్లు తెలిపాడు. ఆసీస్ తరపున 126 వన్డేల్లో 4882 పరుగులు, 61 టీ20ల్లో 1989 పరుగులు చేశాడు.
(రోహిత్ బ్యాట్ సౌండ్.. నాకు తొలి జ్ఞాపకం!)
Comments
Please login to add a commentAdd a comment