న్యూఢిల్లీ : భారత్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ తుది సమరానికి న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదికగా నిలిచింది. ఇప్పటికే చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా తుది సమరానికి సిద్దమయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఫించ్.. బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. ఈ పిచ్‌పై భారీ స్కోర్ చేసి కాపాడుకుంటామని పించ్ ఆశాభావం వ్యక్తం చేయగా.. చేజింగ్‌లో తమది గొప్పజట్టని, అది మరోసారి నిరూపిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.
ఇక ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. భారత తుది జట్టులోకి చహల్, రాహుల్ స్థానాల్లో జడేజా, షమీలు రాగా.. ఆసీస్ తుది జట్టులోకి షాన్ మార్ష్, బెహండ్రాఫ్ స్థానాల్లో మార్కస్ స్టొయినిస్, నాథన్ లయన్‌లు వచ్చారు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ ఆధిపత్యం కనబర్చిన భారత్ చివరి రెండు మ్యాచ్‌లను అనూహ్యంగా ఓడి సిరీస్ ఫలితాన్ని చివరి మ్యాచ్ వరకు తీసుకొచ్చింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
తుది జట్లు
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, పంత్, జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, కుల్దీప్, జడేజా, బుమ్రా, షమీ
ఆస్ట్రేలియా: ఫించ్, ఖాజా, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, టర్నర్, కారీ, రిచర్డ్సన్, కమిన్స్, జంపా, లయన్.
Comments
Please login to add a commentAdd a comment