టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. గాయంతో సుధీర్ఘ కాలం జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20తో ఎంట్రీ ఇచ్చాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించడంతో బుమ్రాకు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. అయినప్పటికి బుమ్రా తన మార్క్‌ను చూపించాడు. 2 ఓవర్లు వేసిన బుమ్రా 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను ఔట్ చేసిన తీరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుమ్రా వేసిన యార్కర్‌కు 15 బంతుల్లో 31 పరుగులతో ధాటిగా ఆడుతున్న ఫించ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. బుమ్రాను ఎందుకు యార్కర్ల కింగ్‌గా పిలుస్తారో ఫించ్‌కు వేసిన డెలివరీని చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అయినా ఫించ్ బుమ్రాను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. పెవిలియన్ వెళ్తూ ''సూపర్ డెలివరీ'' అన్న తరహాలో తన బ్యాట్‌ను చేతితో కొట్టిన ఫించ్ అతన్ని అభినందించాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక బుమ్రా కమ్‌బ్యాక్‌ను టీమిండియా ఫ్యాన్స్ పండుగలా జరుపుకున్నారు. ''బూమ్ బూమ్ బుమ్రా ఈజ్ బ్యాక్.. బుమ్రా వచ్చాడు టీమిండియా గెలిచింది.. అందుకే నిన్ను యార్కర్ల కింగ్ అనేది'' అంటూ కామెంట్స్ చేశారు.
B. O. O. M! ⚡️ ⚡️@Jaspritbumrah93 strikes to dismiss Aaron Finch with a cracker of a yorker. 👍 👍#TeamIndia are chipping away here in Nagpur! 👏 👏
— BCCI (@BCCI) September 23, 2022
Follow the match ▶️ https://t.co/LyNJTtkxVv
Don’t miss the LIVE coverage of the #INDvAUS match on @StarSportsIndia pic.twitter.com/omG6LcrkX8
చదవండి: 'నేనే సర్‌ప్రైజ్ అయ్యా.. అందుకే డీకే పంత్ కంటే ముందుగా'
Comments
Please login to add a commentAdd a comment