IND vs AUS 2nd T20 Nagpur Updates And Highlights - Sakshi
Sakshi News home page

IND vs AUS 2nd T20: రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం

Published Fri, Sep 23 2022 6:04 PM | Last Updated on Fri, Sep 23 2022 11:41 PM

IND vs AUS 2nd T20 Nagpur Updates And Highlights - Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(46) పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కాగా ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడి కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 8ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది.  ఆసీస్‌ బ్యాటర్లలో ఆరోన్‌ ఫించ్‌(31), మాథ్యూ వేడ్‌(43) పరుగులతో రాణించారు.

మూడో వికెట్‌ ‍కోల్పోయిన టీమిండియా
55 పరుగులు వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన కోహ్లి.. జంపా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

మూడు ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 40/1
91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి(1),రోహిత్‌(27) పరుగులతో ఉన్నారు.

భారత్‌ టార్గెట్‌ 91 పరుగులు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఆరోన్‌ ఫించ్‌(31), మాథ్యూ వేడ్‌(43) పరుగులతో రాణించారు.

మూడో వికెట్‌ కీల్పోయిన ఆసీస్‌
31 పరుగులు వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన డేవిడ్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన రెండో ఓవర్‌లో గ్రీన్‌(5) రనౌట్‌ కాగా.. మ్యాక్స్‌వెల్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 19/2

తొలి ఓవర్‌కు ఆసీస్‌ స్కోర్‌: 10/0
తొలి ఓవర్‌ ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్‌(1),ఫించ్‌(9) పరుగులతో ఉన్నారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌
భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. 9:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలి టీ20కు దూరమైన బుమ్రా, పంత్‌.. ఈ మ్యాచ్‌ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్, డేనియల్ సామ్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

భారత్: కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

టాస్‌ ఆలస్యం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడేందకు టీమిండియా సిద్దమైంది. అయితే భారత్‌-ఆస్ట్రేలియా రెండో టీ20 ఆలస్యంగా ప్రారంభం కానుంది. గత రెండు రోజులుగా నాగ్‌పూర్‌లో వర్షం కురస్తుండండంతో.. స్టేడియం ఔట్‌ ఫీల్డ్‌ కాస్త చిత్తడిగా మారింది.

దీంతో 6:30 గంటలకి పడాల్సిన మ్యాచ్ టాస్ కూడా ఆలస్యంకానుంది. కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది
చదవండి: భారత్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ కాదు.. టీ20 ప్రపంచకప్‌ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement