India vs Australia Highlights
-
IND vs AUS: 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
-
వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదరైంది. ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. తుది పోరులో మాత్రం ఆసీస్ జోరు ముందు చిత్తు అయింది. ఫైనల్ పోరులో ఆసీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో సొంత గడ్డపై భారత పతాకాన్ని రెపాలపాడాలంచాలనకున్న రోహిత్ సేన ఆశలు ఆడియాశలయ్యాయి. మరోవైపు వరల్డ్‌కప్‌ను తమ ఇంటిపేరుగా మార్చుకున్న ఆస్ట్రేలియా.. ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఇక ఈ మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో ఛాంపియన్స్, రన్నరప్ జట్లకు ఇచ్చే ఫ్రైజ్మనీపై ఓ లుక్కేద్దాం. విజేతకు ఎంతంటే? వన్డే వరల్డ్‌కప్ ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్‌మనీ రూపంలో 4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) లభించింది. అదే విధంగా అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు 2 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం 16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) దక్కింది. ఇక సెమీ ఫైనల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌కు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు)చొప్పున అందింది. అదే విధంగా గ్రూపు దశ నుంచి వైదొలిగిన 6 జట్లకు లక్ష యూఎస్ డాలర్లు (82 లక్షల 92 వేల 950 రూపాయలు) చొప్పున లభించింది. అదనంగా ప్రతీ గ్రూప్ స్టేజ్ విజయానికి ఆయా జట్లకు 40,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) దక్కుతాయి. చదవండి: CWC 2023: నిరాశలో టీమిండియా! ఫైనల్లో బెస్ట్ ఫీల్డర్ మెడల్ అతడికే.. వీడియో వైరల్ -
రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆసీస్ పై భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(46) పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 8ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఆరోన్ ఫించ్(31), మాథ్యూ వేడ్(43) పరుగులతో రాణించారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 55 పరుగులు వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన కోహ్లి.. జంపా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మూడు ఓవర్లకు భారత్ స్కోర్: 40/1 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి(1),రోహిత్(27) పరుగులతో ఉన్నారు. భారత్ టార్గెట్ 91 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఆరోన్ ఫించ్(31), మాథ్యూ వేడ్(43) పరుగులతో రాణించారు. మూడో వికెట్ కీల్పోయిన ఆసీస్ 31 పరుగులు వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన డేవిడ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్లో గ్రీన్(5) రనౌట్ కాగా.. మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 19/2 తొలి ఓవర్‌కు ఆసీస్ స్కోర్: 10/0 తొలి ఓవర్ ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(1),ఫించ్(9) పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20కు దూరమైన బుమ్రా, పంత్.. ఈ మ్యాచ్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, డేనియల్ సామ్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ టాస్ ఆలస్యం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడేందకు టీమిండియా సిద్దమైంది. అయితే భారత్-ఆస్ట్రేలియా రెండో టీ20 ఆలస్యంగా ప్రారంభం కానుంది. గత రెండు రోజులుగా నాగ్‌పూర్‌లో వర్షం కురస్తుండండంతో.. స్టేడియం ఔట్ ఫీల్డ్ కాస్త చిత్తడిగా మారింది. దీంతో 6:30 గంటలకి పడాల్సిన మ్యాచ్ టాస్ కూడా ఆలస్యంకానుంది. కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు -
భారత్-ఆసీస్ మ్యాచ్ హైలైట్స్
మొహాలి: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పలు విశేషాలు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో విరోచిత ఇన్నింగ్స్ తో అదరగొట్టిన టీమిండియా స్టార్ బాట్స్ మన్ విరాట్ కోహ్లి తన బ్యాటింగ్ గణాంకాలు మరింత మెరుచుపరుచుకున్నాడు. కంగారు టీమ్ పై ధోని సేన తన రికార్డును మరింత పటిష్టం చేసుకుంది. * విరాట్ కోహ్లి 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి టీ20ల్లో రెండో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు సాధించాడు. అతడి వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 90 నాటౌట్. 2016, జనవరి 16న ఆస్ట్రేలియాపైనే నమోదు చేశాడు. * టీ20ల్లో విజయవంతమైన ఛేజింగ్స్ లో భారత్ బ్యాట్స్ మన్ చేసిన అత్యధిక స్కోరు కోహ్లిదే కావడం విశేషం. 2012, సెప్టెంబర్ లో కొలంబొలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి 61 బంతుల్లో 78 పరుగులు చేశాడు. తాజాగా దీన్ని అధిగమించాడు. * అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ రికార్డును కోహ్లి సమం చేశాడు. 15 సార్లు అతడీ ఘనత సాధించాడు. క్రిస్ గేల్(రెండు సెంచీలు, 13 అర్ధసెంచరీలు), బ్రెండన్ మెక్ కల్లమ్(రెండు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు) సరసన నిలిచాడు. * 12సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ తో కోహ్లి టీమిండియా విజయం సాధించిపెట్టాడు. ఈ విషయంలోనూ మెక్ కల్లమ్ తో సమానంగా నిలిచాడు. * విరాట్ కోహ్లి 9 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(ఎంఓఎం) అవార్డు అందుకున్నాడు. షాహిద్ ఆఫ్రిది(11) మాత్రమే అతడి కంటే ముందున్నాడు. * ఆస్ట్రేలియాతో జరిగిన 9 మ్యాచుల్లో కోహ్లి మూడుసార్లు మ్యాన్ ది మ్యాచ్(ఎంఓఎం) దక్కించుకున్నాడు. ఈ విషయంలో క్రిస్ గేల్, ఉమర్ అక్మల్, యువరాజ్ సింగ్ ను వెనక్కునెట్టాడు. వీరు ముగ్గురు ఆసీస్ పై రెండేసిసార్లు ఎంఓఎంగా ఎంపికయ్యారు. టీ20ల్లో ఒక కేలండర్ ఇయర్ లో ఆరుసార్లు ఎంఓఎం అందుకుని ఎవరూ సాధించని ఘనత సాధించాడు. 2012లో షేన్ వాట్సన్ ఐదుసార్లు ఎంఓఎం సాధించాడు. * ఆస్ట్రేలియాతో ఆడిన 13 టీ20ల్లో టీమిండియా 9 సార్లు విజయం సాధించగా, నాలుగింటిలో ఆసీస్ గెలిచింది. కంగారూ టీమ్ పై ధోనిసేన సక్సెస్ రేటు 69.23 శాతంగా ఉంది. మరేదేశంపైనా ఇంత సక్సెస్ రేటు లేదు. * టీ20 మ్యాచుల్లో ఆస్ట్రేలియా 9 సార్లు మరేయితర జట్టుచేతిలో ఓడిపోలేదు. ఆసీస్ ను 9 సార్లు ఓడించిన ఘనత టీమిండియాకే దక్కింది. * 2013, అక్టోబర్ 10- 2016 మార్చి 27 మధ్యలో వరుసగా ఆరు మ్యాచుల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించింది. అంతకుముందు ఇంగ్లండ్ పేరిట ఈ రికార్డును ధోని సేన సమం చేసింది. 2008, ఫిబ్రవరి 5-2013, ఫిబ్రవరి 9 మధ్యలో న్యూజిలాండ్ పై ఇంగ్లీషు టీమ్ వరుసగా ఆరు విజయాలు నమోదు చేసింది.