వరల్డ్‌కప్‌ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా..? | ICC World Cup 2023 Prize Money: Heres How Much India, Australia And Other Teams Will Receive | Sakshi
Sakshi News home page

ICC World Cup 2023 Prize Money: వరల్డ్‌కప్‌ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా..?

Published Mon, Nov 20 2023 6:35 PM | Last Updated on Mon, Nov 20 2023 6:45 PM

ICC World Cup 2023 Prize Money: Heres How Much India, Australia And Other Teams Will Receive - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదరైంది. ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్‌.. తుది పోరులో మాత్రం ఆసీస్‌ జోరు ముందు చిత్తు అయింది. ఫైనల్‌ పోరులో ఆసీస్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.

దీంతో సొంత గడ్డపై భారత పతాకాన్ని రెపాలపాడాలంచాలనకున్న రోహిత్‌ సేన ఆశలు ఆడియాశలయ్యాయి. మరోవైపు వరల్డ్‌కప్‌ను తమ ఇంటిపేరుగా మార్చుకున్న ఆస్ట్రేలియా.. ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఇక ఈ మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో ఛాంపియన్స్‌, రన్నరప్‌ జట్లకు ఇచ్చే ఫ్రైజ్‌మనీపై ఓ లుక్కేద్దాం.

విజేతకు ఎంతంటే?
వన్డే వరల్డ్‌కప్‌ ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్‌మనీ రూపంలో 4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) లభించింది. అదే విధంగా  అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు  2 మిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం 16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) దక్కింది.

ఇక సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌కు  8 లక్షల యూఎస్‌ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు)చొప్పున అందింది. అదే విధంగా గ్రూపు దశ నుంచి వైదొలిగిన 6 జట్లకు లక్ష యూఎస్‌ డాలర్లు​ (82 లక్షల 92 వేల 950 రూపాయలు) చొప్పున లభించింది. అదనంగా ప్రతీ గ్రూప్ స్టేజ్ విజయానికి  ఆయా జట్లకు 40,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) దక్కుతాయి.
చదవండి: CWC 2023: నిరాశలో టీమిండియా! ఫైనల్లో బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ అతడికే.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement