ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ టి20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి20ల్లో 10వేల పరుగులు పూర్తి చేసిన ఆరో బ్యాటర్‌గా ఫించ్ రికార్డు సృష్టించాడు. బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా మెల్‌బోర్న్ రెనేగేడ్స్‌కు ఆడుతున్న ఫించ్ పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డు సాధించాడు. కాగా ఫించ్ కంటే ముందు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, షోయబ్ మాలిక్‌లు ఉన్నారు. కాగా ఫించ్ టి20ల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 327 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
చదవండి: BBL 2021: మా బంతి పోయింది.. కనబడితే ఇచ్చేయండి!
ఇక విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 285 ఇన్నింగ్స్‌లు.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి 299 ఇన్నింగ్స్‌లు.. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ 303 ఇన్నింగ్స్‌లు.. పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 368 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. అయితే కీరన్ పొలార్డ్‌కు మాత్రం టి20ల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 450 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment