Toss Winning Team Won T20 World Cup 2021 Title.. టి20 ప్రపంచకప్ 2021 ఆఖరి అంకానికి చేరుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు మరికొద్ది గంటల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మ్యాచ్ పరంగా చూస్తే ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ దానికి మించి టాస్ మరింత ఫెవరెట్‌గా మారింది. దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటే సగం విజయం సాధించినట్టే.
చదవండి: 'యువీ నువ్వుంటే బాగుండేది'': కోహ్లి.. అనుష్క రియాక్షన్ వైరల్
ఈ టి20 ప్రపంచకప్‌లో దుబాయ్ వేదికగా జరిగిన అన్ని మ్యాచ్‌లు ఇదే రుజువు చేస్తున్నాయి. ఇక్కడ జరిగిన 12 మ్యాచ్‌ల్లో మొదట బౌలింగ్ చేసిన జట్లు 11 సార్లు విజయం సాధించగా.. ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. ఇక టాస్ గెలిచిన జట్లు 10 సార్లు విజయం అందుకోగా.. రెండుసార్లు మాత్రమే ఓటమి పాలయ్యాయి. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్ సహా మొత్తం 44 మ్యాచ్‌లు జరగ్గా.. 29 సార్లు టాస్ గెలిచిన జట్లు విజయం సాధించడం విశేషం. విన్నింగ్ శాతం 65.9% ఉంది. ఇంకో విషయమేంటంటే దుబాయ్ వేదికగా రాత్రి జరిగిన తొమ్మిది మ్యాచ్‌లు చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.
రాత్రి మ్యాచ్‌ల్లో చేజింగ్ సమయంలో మంచు ప్రభావం ఉండడంతో 9 మ్యాచ్‌ల్లో బౌలర్లు కేవలం ఎనిమిది వికెట్లే పడగొట్టగలిగారు. ఈ ప్రపంచకప్ మాత్రమే కాదు 2014, 2016లోనూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం.. లేదా చేజింగ్ టీమ్‌లే విశ్వవిజేతలుగా నిలవడం విశేషం. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్లో టాస్ ఎవరు గెలిస్తే వాళ్లు బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే
Now for the main event 💥
— ICC (@ICC) November 13, 2021
New Zealand and Australia are in the final… and they’re ready 💪
Are you? https://t.co/VISgYpY6QE#T20WorldCup pic.twitter.com/p5nH9o5VxR
Comments
Please login to add a commentAdd a comment