సమయం: 23:00.. టి20 ప్రపంచకప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. మిచెల్ మార్ష్ (46 బంతుల్లో 78 పరుగులు, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)మరోసారి మెరవడంతో ఆసీస్ సులువుగానే విజయం సాధించింది.
మిచెల్ మార్ష్ మెరుపులు.. 16 ఓవర్లలో 149/2
మిచెల్ మార్ష్ 39 బంతుల్లో 69 పరుగులతో మెరుపులు మెరిపిస్తుండడంతో ఆసీస్ విజయం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 149 పరుగుల చేసింది. మ్యాక్స్‌వెల్ 10 బంతుల్లో 21 పరుగులతో సహకరిస్తున్నాడు.
వార్నర్ అర్థశతకం.. 11 ఓవర్లలో 97/1
డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వార్నర్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు మిచెల్ మార్ష్ కూడా 26 బంతుల్లో 40 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
సమయం: 22:02.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(42) మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫించ్ ఔటైన అనంతరం వార్నర్ దూకుడు చూపిస్తుండడంతో ఆసీస్ స్కోరుబోర్డు పరుగుపెడుతుంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.
ఫించ్(5) ఔట్.. 6 ఓవర్లలో ఆస్ట్రేలియా 43/1
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరోన్ ఫించ్(5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. వార్నర్ 19, మిచెల్ మార్ష్ 17 పరుగులతో ఆడుతున్నారు.
విలియమ్సన్ విధ్వంసం.. 20 ఓవర్లలో కివీస్ 172/4
కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(85 పరుగులు, 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 10 ఓవర్లు ముగిసేసరికి 57/1 గా ఉన్న న్యూజిలాండ్ స్కోరు 16 ఓవర్లలో 132 పరుగులకు చేరింది. 6 ఓవర్లలో 75 పరుగులు సాధించిందంటే అదంతా కేన్ విలియమ్సన్ మాయే అని చెప్పొచ్చు. ఇక స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో 4,4,6,0,4,4తో విలియమ్సన్ విశ్వరూపం చూపించాడు.
కేన్ విలియమ్సన్(85) ఔట్.. న్యూజిలాండ్ 149/4
దూకుడుగా ఆడుతున్న కేన్ విలియమ్సన్(85) హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.. అయితే ఈ న్యూజిలాండ్ కెప్టెన్ తన శైలికి విరుద్ధంగా దూకుడుగా ఆడుతూ ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. 48 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. అంతకముందు అతనికి సహకరిస్తున్న గ్లెన్ ఫిలిప్స్(18) హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో మూడో వికెట్ కోల్పోయింది.
కేన్ మామ ఫిఫ్టీ.. న్యూజిలాండ్ 13 ఓవర్లలో 97/2
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో కేన్ విలియమ్సన్ అర్థసెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్ జంపా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
10 ఓవర్లలో న్యూజిలాండ్ 57/1
సమయం: 20:13.. 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ వెనుదిరిగిన తర్వాత గప్టిల్(27), విలియమ్సన్(17)లు ఆచితూచి ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
సమయం: 19:50.. డారిల్ మిచెల్(11) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ ఐదో బంతికి షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. గప్టిల్ 16, విలియమ్సన్ 0 పరుగులతో ఆడుతున్నారు.
సమయం: 19:39.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 10, మిచెల్ 3 పరుగులతో ఆడుతున్నారు.
దుబాయ్: టి20 ప్రపంచకప్ 2021 ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మహాసంగ్రామం మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ అనుహ్య విజయం సాధించింది. మరో వైపు రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై అద్బుత విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగు పెట్టింది. అయితే ఈ రెండు జట్లలో ఏది విజయం సాధించిన.. ఈసారి ట్రోఫిని కొత్త జట్టు ముద్దాడబోతోంది. కాగా ఈ రెండు జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. దీంతో టైటిల్ ఫేవరేట్ ఏ జట్టు అనేది అంచనా వేయడం కష్టమే.
కాగా టీ20ల్లో 14 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ముఖా ముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది.
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
Comments
Please login to add a commentAdd a comment