NZ Vs Aus: ఒకే ఒక్క మార్పు.. మిగతా అంతా సేమ్‌ టూ సేమ్‌! | WC 2022 Super 12 NZ Vs Aus: Check Playing XI Few Changes Last Final | Sakshi
Sakshi News home page

NZ Vs Aus Playing XI: ఒకే ఒక్క మార్పు.. మిగతా అంతా సేమ్‌ టూ సేమ్‌! కొత్తగా ఎవరంటే?

Published Sat, Oct 22 2022 1:25 PM | Last Updated on Sat, Oct 22 2022 1:39 PM

WC 2022 Super 12 NZ Vs Aus: Check Playing XI Few Changes Last Final - Sakshi

PC: ICC

ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Australia- Super 12 Group 1: టీ20 ప్రపంచకప్‌-2021లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏకంగా టైటిల్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌ మీద 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి... తద్వారా తొలిసారిగా పొట్టి ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడింది ఆరోన్‌ ఫించ్‌ బృందం.

ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌కప్‌-2022లో ఫేవరెట్‌గా మారిన ఆసీస్‌.. సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతోంది. ఇందులో భాగంగా.. ఒకే ఒక్క మార్పు మినహా నాడు ఫైనల్‌ ఆడిన అదే జట్టుతో బరిలోకి దిగింది. మరోవైపు.. కివీస్‌ సైతం నాలుగైదు మార్పులతో మైదానంలో అడుగుపెట్టింది.

టీ20 ప్రపంచకప్‌-2022: సూపర్‌ 12
న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా
తుది జట్లు:

న్యూజిలాండ్‌
డెవాన్ కాన్వే(వికెట్‌ కీపర్‌), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

ఆస్ట్రేలియా:
ఆరోన్ ఫించ్(కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.

టీ20 ప్రపంచకప్‌-2021: ఫైనల్‌లో తుది జట్లు
న్యూజిలాండ్‌
మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టిమ్ సీఫెర్ట్ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్.

ఆస్ట్రేలియా
డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.

చదవండి: Gautam Gambhir: వ్యక్తిగతంగా కాదు.. జట్టుకు భజన చేయండి; ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి ఇదే ప్రధాన కారణం 
Rohit Sharma: తొమ్మిదేళ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు.. అయితే ఈసారి మాత్రం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement