World Cup 2022 Super 12: New Zealand vs Australia Updates Highlights - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ఆసీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌.. 89 పరుగుల తేడాతో ఘన విజయం

Published Sat, Oct 22 2022 12:33 PM | Last Updated on Tue, Oct 25 2022 5:33 PM

World Cup 2022 Super 12: New Zealand vs Australia Updates Highlights - Sakshi

New Zealand vs Australia, 13th Match, Super 12 Group 1- Updates:
టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఆసీస్‌ ఓటమి చెందింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 111 పరుగులకే కుప్పకూలింది.

న్యూజిలాండ్‌ బౌలర్లలో శాంట్నర్‌, సౌథీ మూడు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించగా.. బౌల్ట్‌, ఫెర్గూసన్‌, సోధి తలా వికెట్‌ సాధించారు. ఆసీస్‌ బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్‌ 28 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఓటమికి చేరువలో ఆస్ట్రేలియా
న్యూజిలాండ్‌తో సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమికి చేరవైంది. 16.3 ఓవర్లకు 109 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్‌ వేసిన కివీస్‌ పేసర్‌ వరుసగా స్టార్క్‌, జంపాను పెవిలియన్‌కు పంపాడు.

గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అవుట్‌
ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు టాప్‌ స్కోరర్‌గా ఉన్న గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (28) సైతం పెవిలియన్‌ చేరాడు. దీంతో కంగారూ జట్టు ఏడో వికెట్‌ కోల్పోయింది. భారీ లక్ష్యం ముందున్న వేళ టాపార్డర్‌ కుప్పకూలడంతో 14 ఓవర్లు ముగిసే సరికి కనీసం వంద(91-7) పరుగులు కూడా చేయలేకపోయింది.

ఫెర్గూసన్‌కు తొలి వికెట్‌
ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌ పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 86/6 (12.4)

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ ​కోల్పోయింది. సాంట్నర్‌ బౌలింగ్‌లో అతడు పెవిలియన్‌ చేరాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.

స్టొయినిస్‌ అవుట్‌
సాంట్నర్‌ బౌలింగ్‌లో స్టొయినిస్‌ షాట్‌ ఆడగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ అద్బుత క్యాచ్‌తో అతడికి షాకిచ్చాడు. దీంతో ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కివీస్‌ బౌలర్లు సౌతీ, సాంట్నర్‌ ఇప్పటి వరకు చెరో రెండు వికెట్లు తీశారు. తొమ్మిది ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 54-4

మూడో వికెట్‌ డౌన్‌.. మిచెల్‌ మార్ష్‌ అవుట్‌
ఆరంభంలోనే ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్నారు కివీస్‌ బౌలర్లు. సౌతీ .. వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లను పెవిలియన్‌కు పంపగా.. సాంట్నర్‌.. ఫించ్‌ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ స్కోరు: 34-3

ఆరోన్‌ ఫించ్‌ రూపంలో రెండో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
4 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ స్కోరు- 30/2 

ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. వార్నర్‌ అవుట్‌
201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది.  5 పరుగులు చేసిన డెవిడ్‌ వార్నర్‌.. సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్‌ మార్ష్‌ వచ్చాడు. 

కాన్వే అద్భుత ఇన్నింగ్స్‌.. కివీస్‌ స్కోరెంతంటే
ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌ (16 బంతుల్లో 42 పరుగులు), డెవాన్‌ కాన్వే (92 పరుగులు- నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్‌ 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

17 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ స్కోరు- 161/3
మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
15.6 ఓవర్‌ వద్ద కివీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ అతడికే క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

15 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ స్కోరు: 144/2
కాన్వే 70, గ్లెన్‌ ఫిలిప్స్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌
కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ రూపంలో న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 23 బంతులు ఎదుర్కొన్న అతడు 23 పరుగులు చేశాడు.

అర్ధ శతకం పూర్తి చేసుకున్న ​కాన్వే
ఆసీస్‌తో ఆరంభ మ్యాచ్‌లో కివీస్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే హాఫ్‌ సెంచరీ సాధించాడు. 13వ ఓవర్‌ మొదటి బంతికి జంపా బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 

పది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ స్కోరు: 97-1
కాన్వే 42, విలియమ్సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.(28)

పవర్‌ ప్లే ముగిసే సరికి కివీస్‌ స్కోరు:  69/1
కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 4, ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన కివీస్‌
ఫిన్‌ అలెన్‌ రూపంలో న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 42 పరుగులతో జోరు మీదున్న అలెన్‌ను హాజిల్‌వుడ్‌ తన అద్భుతమైన బంతితో బౌల్డ్‌ చేశాడు. కేన్‌ విలియమ్సన్‌, డెవాన్‌ కాన్వే క్రీజులో ఉన్నారు. 4.1 ఓవర్లలో కివీస్‌ స్కోరు-  56/1.

దంచి కొడుతున్న ఫిన్‌ అలెన్‌
ఆసీస్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ జట్టుకు ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే శుభారంభం అందించారు. అలెన్‌ 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 42 పరుగులు సాధించాడు. కాన్వే 9 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 14 పరుగుల వద్ద ఉన్నాడు. వీరిద్దరి విజృంభణతో 4 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ 56 పరుగులు చేసింది.

టీ20 ప్రపంచకప్‌-2022 అసలైన సమరానికి తెరలేచింది. సూపర్‌-12 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా- రన్నరప్‌ న్యూజిలాండ్‌ సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు:
న్యూజిలాండ్‌
డెవాన్ కాన్వే(వికెట్‌ కీపర్‌), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

ఆస్ట్రేలియా:
ఆరోన్ ఫించ్(కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.

చదవండి: Rohit Sharma: తొమ్మిదేళ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు.. అయితే ఈసారి మాత్రం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement