
మొహాలీ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరిలో ఆసీస్ ఆటగాడు మాథ్యూ వేడ్(20 బంతుల్లో 45 పరుగులు) దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు, ఉమేశ్‌యాదవ్ రెండు, చాహల్ ఒక్క వికెట్ సాధించాడు. ఇక అంతకుముందు హార్దిక్ పాండ్యా చేలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.
హార్దిక్ కేవలం 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(55) సూర్యకుమార్ యాదవ్( 46) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్ మూడు, హాజిల్ వుడ్ రెండు, గ్రీన్ ఒక్క వికెట్ సాధించారు.
17 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 169/5
17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 18 బంతుల్లో 40 పరుగులు కావాలి.
వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్
ఉమేశ్ యాదవ్ వేసిన 13 ఓవర్‌లో ఆసీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. స్మిత్, మ్యాక్స్‌వెల్ వికెట్ కీపర్‌లకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. 13 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 134/4
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
109 పరుగులు వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన గ్రీన్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 90/1
ఆస్ట్రేలియా దీటుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(47), స్మిత్(19) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ఫించ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి స్టీవన్ స్మిత్ వచ్చాడు.
3 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 38/0
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. క్రీజులో ఆరోన్ ఫించ్(22), గ్రీన్(16) పరుగులతో ఉన్నారు.
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఆసీస్ టార్గెట్ 209 పరుగులు
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. హార్దిక్ పాండ్యా చేలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. హార్దిక్ కేవలం 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
అఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టి ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. అదే విధంగా భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(55) సూర్యకుమార్ యాదవ్( 46) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్ మూడు, హాజిల్ వుడ్ రెండు, గ్రీన్ ఒక్క వికెట్ సాధించారు.
ఐదో వికెట్ కోల్పోయిన భారత్
148 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
126 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 46 పరుగులుతో దూకుడుగా ఆడుతోన్న సూర్యకుమార్ యాదవ్.. గ్రీన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
మూడో వికెట్ కోల్పోయిన భారత్
103 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన రాహుల్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్లిస్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు.
కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్దసెంచరీ సాధించాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీని రాహుల్ పూర్తి చేసుకున్నాడు. ఇక 11 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(50), సూర్యకుమార్ యాదవ్(25) పరుగులో ఉన్నారు.
8 ఓవర్లకు భారత్ స్కోర్: 69/2
8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(37), సూర్యకుమార్ యాదవ్(17) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్.. కోహ్లి ఔట్
35 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ ఔట్
21 పరుగులు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.
2ఓవర్లకు భారత్ స్కోర్: 14/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(3), రోహిత్ శర్మ(11) పరుగలతో ఉన్నారు.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్లు మధ్య మొహాలీ వేదికగా జరగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, బుమ్రా దూరమయ్యారు.
తుది జట్లు
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహాల్
Comments
Please login to add a commentAdd a comment