ఆస్ట్రేలియా వర్సెస్‌ ఐర్లాండ్‌.. తుది జట్టులో ఎవరెవరంటే! | T20 WC AUS Vs IRE: Ireland have won the toss and have opted to Field | Sakshi
Sakshi News home page

T20 WC AUS Vs IRE: ఆస్ట్రేలియా వర్సెస్‌ ఐర్లాండ్‌.. తుది జట్టులో ఎవరెవరంటే!

Published Mon, Oct 31 2022 1:12 PM | Last Updated on Mon, Oct 31 2022 1:27 PM

T20 WC AUS Vs IRE: Ireland have won the toss and have opted to Field - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా ఐర్లాండ్‌తో కీలక పోరుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. బ్రేస్బేన్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. సెమీస్‌ రేసులో ఆసీస్‌ నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా విజయం సాధించాలి. పాయింట్ల పట్టికలో గ్రూపు-1 నంచి ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది.

తొలి మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో ఘోర ఓటమి చవి చూసిన ఫించ్‌ సేన.. అనంతరం శ్రీలంకపై విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్‌తో కీలకమైన మ్యాచ్‌ రద్దు కావడంతో ఆస్ట్రేలియా ఖాతాలో కేవలం ఒక్క పాయింట్‌ చేరింది. మరోవైపు ఐర్లాండ్‌కు కూడా ఇది డూ ఆర్‌డై మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తానే ఐర్లాండ్‌ తమ సెమీస్‌ ఆశలు సజీవంగా నిలుపుకుంటుంది.

తుది జట్లు: 
ఆస్ట్రేలియా
డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్‌), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్

ఐర్లాండ్‌
పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్‌), లోర్కాన్ టక్కర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, ఫియోన్ హ్యాండ్, జాషువా లిటిల్
చదవండి: Virat Kohli: కోహ్లికి చేదు అనుభవం! వీడియో వైరల్‌.. విరాట్‌ సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement